Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్యం తాగి వాహనాలు నడపొద్దు: ప్రాణాలకు ముప్పు - SI వెంకటేశం

మద్యం తాగి వాహనాలు నడపొద్దు: ప్రాణాలకు ముప్పు - SI వెంకటేశం

వార్త 3 months ago

హెల్మెట్ తప్పనిసరి… అవగాహన కార్యక్రమంలో పుల్కల్ ఏఎస్ఐ వెంకటేశం సూచనలు

Road Safety Awareness Choutkur: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలో రహదారి భద్రతపై పుల్కల్ ఏఎస్ఐ వెంకటేశం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. మద్యం తాగి వాహనం నడిపితే కేవలం డ్రైవర్‌కే కాకుండా ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలుగుతుందని హెచ్చరించారు.

Read Also:Tragedy : కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం

ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి, వేగ నియంత్రణలో ఉండాలి, మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 Road Safety Awareness Choutkur ASI Venkatesham

ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, వాహనదారులు పాల్గొన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలని పుల్కల్ ఏఎస్ఐ వెంకటేశం పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తాడిపత్రిలో ఘనంగా శ్రీరామనవమి: వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha