Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహారాష్ట్ర హింగోలిలో భూకంపం

మహారాష్ట్ర హింగోలిలో భూకంపం

వార్త 2 months ago

Earthquake in Maharashtra: మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఈ భూకంప ప్రభావం హింగోలితో పాటు పొరుగు జిల్లాలైన నాందేడ్, పర్భినిపై కూడా పడింది. అక్కడ కూడా భూమి కంపించడంతో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి.

Read Also:Mathura Boat Accident : యూపీలో ఘోర పడవ ప్రమాదం.. 10 మంది మృతి

రోడ్లపైకి పరుగులు తీసిన జనం

శనివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం గమనించిన జనం భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సెకన్ల పాటు సాగిన ఈ ప్రకంపనల వల్ల ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు రోడ్లపైనే ఉండిపోయారు. నాందేడ్, పర్భిని ప్రాంతాల్లో కూడా ఇదే తరహా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

Earthquake in Maharashtra: తప్పిన ప్రాణ, ఆస్తి నష్టం

భూకంప తీవ్రత 4.7గా ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. అధికారులు జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పాత భవనాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

10 మంది మృతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha