SSMB29 Varanasi First Look: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు మర్చిపోలేని తీపి కబురు అందించారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' (Varanasi) నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లను అధికారికంగా విడుదల చేశారు. ఈ పాన్-వరల్డ్ సినిమాలో మహేశ్‌బాబు 'రుద్ర' అనే అత్యంత శక్తివంతమైన, విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
Read Also :Allu Arjun : అల్లు అర్జున్ కు డైహార్డ్ ఫ్యాన్ అంటున్నక్రేజీ బ్యూటీ
ఆకట్టుకుంటున్న లుక్స్ & రాజమౌళి కామెంట్స్

- సరికొత్త అవతారంలో 'రుద్ర':విడుదల చేసిన పోస్టర్లలో మహేశ్‌బాబు సరికొత్త లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. ఒక పోస్టర్‌లో నదిపై వెదురు తెప్పపై ప్రశాంతంగా సేద తీరుతూ కనిపించగా, మరొక దాంట్లో ఆఫ్రికా దట్టమైన అడవుల్లో ప్రకృతులు, పర్వతాలను వీక్షిస్తున్న గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు."తీవ్రత మాత్రమే అతని నైజం కాదు… 'వారణాసి'లో రుద్ర" అని మహేశ్‌బాబు ఈ పోస్టర్లను పంచుకున్నారు.
- రాజమౌళి ప్రశంసల జల్లు:ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.."రుద్ర ఒక ప్రత్యేక లక్ష్యం కోసం జన్మించాడు. చమత్కారం, సున్నితత్వం, తీవ్రత మేళవించిన ఈ విలక్షణమైన పాత్రకు మహేశ్‌బాబు తన నటనతో ప్రాణం పోశాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో, మసాయ్ మారా అడవుల్లో చిత్రీకరించిన లొకేషన్లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి" అని వ్యాఖ్యానించారు.
SSMB29 Varanasi First Look: కాస్ట్, క్రూ & కథాంశం వివరాలు
- స్టార్ కాస్ట్: ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరుద్దరూ కూడా మహేశ్‌బాబుకు బర్త్‌డే విషెస్ తెలిపారు.
- సినిమా కథాంశం: వారణాసి నగరం వైపు ఒక ప్రమాదకరమైన గ్రహశకలం (Asteroid) దూసుకొస్తున్న క్రమంలో 'రుద్ర' అనే కథానాయకుడు ప్రపంచాన్ని, నగరాన్ని కాపాడటానికి ఏం చేశాడనే సస్పెన్స్, అడ్వెంచర్స్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.
- షూటింగ్ అప్‌డేట్: ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రధానమైన ఆఫ్రికన్ యాక్షన్ సీక్వెన్సెస్ పూర్తయ్యాయని, ప్రస్తుతం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.
- కథ & నిర్మాణం: వి. విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కంచి కథను అందించగా.. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

