Maheshwaram Drug News : ఎస్టి(Special Team) పోలీసులు, మహేశ్వరం పోలీసులు సమన్వయంతో దాడులు నిర్వహించి కోటి రూపాయాల విలువ చేసే డ్రగ్స్ ను స్వాదీనం చేసుకున్నారు.
ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు జరిపిన తనిఖీలో ఈ అక్రమరవాణ భారీగా పట్టుబడింది. ఒరిస్సా నుంచి నేరుగా హైదరాబాదు గంజాయి నుంచి తయారు చేసిన హషీస్ అయిల్ (నూనే) తరలిస్తుండగా ప్యూచర్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా నిర్వహించిన తనిఖీలో పట్టుబడింది. పట్టుబడిన అయిల్ విలువ కోటి రూపాయాలవరకు ఉందని పోలీసులు అంచన వేశారు. 9. 402 కిలోల హషీస్ ఆయిల్ ను స్వాదీనం చేసుకున్నారు.
Read Also:Amanagallu crime:భార్య, కొడుకును చంపి.. కూతురిని ఆసుపత్రి పాలు చేసిన తండ్రి
Maheshwaram Drug News: ఒరిస్సా టు హైదరాబాద్
హషీస్ అయిలను తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తి ఆంద్రప్రదేశ్ అల్లూరు జిల్లా సీతారామారాజు నివాసినిగా గుర్తించారు. మిగితా ఇద్దరు వ్యక్తులు ఎ 2 రాజారావు ఒరిస్సా వ్యక్తి పరారీలో ఉన్నారని, ఎ 3 వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు పేర్కోన్నారు. పోలీసుల కథనం ప్రకారం చంటిబాబు గత కొంత కాలంగా ఎ 2 రాజారావు నుండి ఈ డ్రగ్స్ ను సేకరించినగరంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహేశ్వరం గేటు సమీపంలో అక్రమ రవాణకు పాల్పడుతు ఇతర వ్యక్తుల చంటిబాబును అమ్మకాలకు ప్రయత్నిస్తున్న అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కంచర పాలెం, అనకాపల్లి, విశాఖపట్నం తితదర ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహేశ్వరం సిఐ రాఘవెందర్రెడ్డి, ఎస్ఐ ప్రసాద్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు..ఎస్ఐ సహా నలుగురికి తీవ్ర గాయాలు

