Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళ ప్రాణం తీసిన చీర కొంగు!

మహిళ ప్రాణం తీసిన చీర కొంగు!

వార్త 1 week ago

Narsingi Road Accident: రోడ్డు ప్రయాణాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన మరోసారి నిరూపించింది.

షేక్‌పేట్ ఓయూ కాలనీకి చెందిన బానోత్ ధర్మిని (56) తన కుమార్తె సంతోషితో కలిసి ఖానాపూర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఖానాపూర్ చెక్‌పోస్ట్ సమీపానికి చేరుకోగానే, ధర్మిని కట్టుకున్న చీర కొంగు బైక్ వెనుక చక్రంలో చిక్కుకుపోవడంతో ఆమె ఒక్కసారిగా బైక్ పైనుంచి కిందపడిపోయారు.

Read Also:Hyderabad Lift Collapse Accident: తెగిపడ్డ అపార్ట్‌మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు!

Narsingi Road Accident:బైక్ ప్రయాణంలో అప్రమత్తత అవసరం

ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రమైన గాయాలు కావడంతో క్షతగాత్రురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మరణించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు తమ దుస్తుల విషయంలో, ముఖ్యంగా చీరలు, చున్నీల విషయంలో పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha