DU Professor Murder: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన ఢిల్లీ యూనివర్సిటీ (DU) అసిస్టెంట్ ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ (Debosmita Paul) దారుణ హత్య ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది.
తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే చేధించారు.
Read Also :Sanath Nagar news: BRS నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ.. 1.5 కోట్లు మాయం
ఆస్తి వివాదమే కారణం - పశ్చిమ బెంగాల్ దంపతుల అరెస్ట్
West Bengal Couple Arrested For Killing Assistant Professor Debosmita Paul Over Property Dispute
ఇంట్లోకి ఎలాంటి బలవంతపు ప్రవేశం (Forced Entry) లేకపోవడంతో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని భావించిన పోలీసులు.. సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక దంపతులు ఒక పాత ఆస్తి వివాదం (Property Dispute) కారణంగా దేబోస్మితాను హతమార్చాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం వారు తమ చిన్నారితో కలిసి బెంగాల్ నుండి దాదాపు 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీకి వచ్చారు. జూన్ 3న సదరు భార్యాభర్తలు మాస్కులు ధరించి దేబోస్మితా ఉంటున్న ‘సత్యం అపార్ట్‌మెంట్స్’ ఫ్లాట్‌కు వెళ్లారు. చిన్నారిని బయటే ఉంచి, లోపలికి వెళ్లి ఆమె తలపై బరువైన వస్తువుతో బలంగా కొట్టారు. ఆపై మణికట్టు నరాలు కోసి, ఫ్లాట్‌కు బయట నుండి తాళం వేసి పారిపోయారు.
DU Professor Murder: వెలుగులోకి వచ్చిందిలా
దేబోస్మితా పాల్ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజీ (Shivaji College) లో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఆ ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. జూన్ 4న దేబోస్మితా సోదరి దేవరతి పాల్ ఎంత ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఫ్లాట్ దగ్గరకు వెళ్లి చూడగా బయట తాళం వేసి ఉంది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా దేబోస్మితా రక్తం మడుగులో శవమై కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న న్యూ అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి గొడవల కోణంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

