CM Revanth Reddy: చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ విషయంలో బీజేపీ కావాలనే అపోహలు సృష్టిస్తోందని, కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మహిళా సాధికారతకు తమ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
Read Also:Telangana Politics: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్!
Chief Minister Revanth Reddy highlighted flaws in the implementation of the Women’s Bill.
CM Revanth Reddy: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు
రిజర్వేషన్ల అమలు కోసం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. జనాభా నియంత్రణలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం సరికాదని, ఈ విషయంలో కేంద్రం పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

