Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళకు వేధింపుల కేసు.. తెనాలి సీఐ రాములు నాయక్ సస్పెండ్

మహిళకు వేధింపుల కేసు.. తెనాలి సీఐ రాములు నాయక్ సస్పెండ్

వార్త 1 month ago

CI Ramulu Nayak Suspended: రెండో పెళ్లి చేసుకుని మోసం చేయడమే కాకుండా, ప్రస్తుతం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్ ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో తెనాలి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) రాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలు నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది.

పోలీస్ స్టేషన్‌లో పరిచయం.. శ్రీశైలంలో పెళ్లి

బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. 2004లో తన మొదటి భర్తతో వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆమె ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాములు నాయక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆయన నిరంతరం ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో ఆమెకు దగ్గరయ్యారు. అప్పటికే రాములు నాయక్‌కు వివాహం జరిగినప్పటికీ, ఆ విషయాన్ని దాచిపెట్టి శ్రీశైలంలో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. గత 14 ఏళ్లుగా తామిద్దరం భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నామని ఆమె ఎస్పీ ఎదుట వాపోయింది.

CI Ramulu Nayak Suspended: తెనాలి సీఐగా వచ్చాక మారిన ప్రవర్తన.. సెటిల్‌మెంట్ ఆఫర్!

రాములు నాయక్ ప్రమోషన్ పొంది తెనాలి సీఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చిందని బాధితురాలు ఆరోపించారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను దూరం పెట్టడం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గొడవ వదిలించుకునేందుకు రూ. 30 లక్షలు ఇస్తానంటూ ఒక సెటిల్‌మెంట్ ఒప్పంద పత్రాన్ని కూడా తనకు పంపించారని వెల్లడించారు. ఆ ఒప్పందాన్ని తాను తిరస్కరించినందుకు కక్షగట్టి, తనపై భౌతికంగా దాడులు కూడా చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్పీకి సాక్ష్యాలు సమర్పణ.. సమగ్ర విచారణకు ఆదేశం

తన ఆరోపణలను నిరూపించేందుకు రాములు నాయక్‌తో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు, వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల (కాల్ డేటా) రికార్డులను బాధితురాలు ఎస్పీకి సాక్ష్యాలుగా అందజేశారు. ప్రాథమిక ఆధారాలు, బాధితురాలి ఫిర్యాదును పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు సీఐ రాములు నాయక్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

టెన్త్ సర్టిఫికెట్ సవరణకు లాస్ట్ డేట్ ఇదే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha