PMFME-Stree Nidhi scheme : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్కరణ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం’ (PMFME)ను, రాష్ట్రంలోని ‘స్త్రీనిధి’ రుణ సదుపాయంతో అనుసంధానం చేస్తున్నట్లు సెర్ప్ మరియు చేనేత, జవుళి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల్లో (డ్వాక్రా) ఉన్న అర్హులైన మహిళలకు ఆహార శుద్ధి (Food Processing) యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, వారు సొంత కాళ్లపై నిలబడేలా చేసేందుకు ఈ ఉమ్మడి పథకం ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు.

ఉపాధి అవకాశాలు - ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళా వ్యాపారవేత్తలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందించనుంది. సేకరించిన రుణాలు మరియు సబ్సిడీల ద్వారా ఫ్రూట్స్ జ్యూస్‌లు/ప్రాసెసింగ్, రకరకాల స్నాక్స్, సాంప్రదాయ పిండి పదార్థాల తయారీ, ఊరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి యూనిట్లను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. నాణ్యమైన ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన శిక్షణ, మార్కెటింగ్ మెళకువలను కూడా అధికారుల ద్వారా అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. మహిళలు కేవలం గృహిణులుగానే పరిమితం కాకుండా, చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా స్థానికంగా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని విస్పష్టంగా తెలియజేశారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. నకిలీ వెబ్‌సైట్ల వలలో పడొద్దు!

