Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళలపై నేరాల కేసుల్లో దేశంలో ఏపీకి రెండో స్థానం

మహిళలపై నేరాల కేసుల్లో దేశంలో ఏపీకి రెండో స్థానం

వార్త 14 hrs ago

AP: మహిళల భద్రత, రక్షణ చట్టాల గురించి నిత్యం పార్లమెంటు, అసెంబ్లీలలో గళం విప్పాల్సిన ప్రజాప్రతినిధులే నేరాల్లో నిందితులుగా ఉండటం పట్ల అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజా నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దేశవ్యాప్తంగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులను విశ్లేషించి శుక్రవారం విడుదల చేసిన ఈ రిపోర్టులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 4,881 మంది ప్రజాప్రతినిధుల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే.. 187 మందిపై మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తేలింది. వీరిలో 19 మంది ఎంపీలు, 168 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నేరుగా అత్యాచార (ఐపీసీ 376) అభియోగాలు ఎదుర్కొంటున్న వారు 14 మంది (12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు) ఉండటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో కలవరపెడుతున్న గణాంకాలు.. ఏపీకి దేశంలోనే రెండో స్థానం

మహిళలపై నేరాల కేసులున్న ప్రజాప్రతినిధుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో మొత్తం 22 మంది (21 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ) ఈ జాబితాలో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వంలోని నలుగురు మంత్రులపై కూడా ఇలాంటి కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. అంతేకాకుండా, ఒక వివాదాస్పద ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు ఉండగా, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన యువ ఎంపీతో పాటు రాజ్యాంగ పదవిలో ఉన్న సీనియర్ నేతపై కూడా అభియోగాలున్నట్లు తెలిపింది. ఇక తెలంగాణలో మొత్తం ఐదుగురు (ముగ్గురు లోక్‌సభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు) ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో ముగ్గురు బీజేపీ ఎంపీలు కాగా, తొలిసారి గెలిచిన ఒక సిట్టింగ్ ఎంపీపై అత్యాచారం కేసు నమోదు కావడం గమనార్హం.

AP: పార్టీలవారీగా అగ్రస్థానంలో బీజేపీ.. రాష్ట్రాలవారీగా పశ్చిమ బెంగాల్ టాప్

ఈ నివేదిక ప్రకారం పార్టీల వారీగా చూస్తే.. బీజేపీకి చెందిన 106 మంది (95 ఎమ్మెల్యేలు, 11 ఎంపీలు) ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ నుంచి 20 మంది, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి 18 మంది (17 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ) ఉన్నారు. బీజేపీకి చెందిన 11 మంది ఎంపీలలో ఐదుగురు కేంద్ర మంత్రులు కాగా, వారిలో ఒకరు తెలుగు రాష్ట్రానికి చెందినవారు ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే పశ్చిమ బెంగాల్ (69) మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ (22) రెండో స్థానంలో, ఒడిశా (17) మూడో స్థానంలో ఉన్నాయి.

నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇవ్వొద్దు.. ఏడీఆర్ తీవ్ర డిమాండ్

మహిళలపై అఘాయిత్యాలు, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించడాన్ని ఏడీఆర్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి నేర చరిత్ర కలిగిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వత అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, ప్రజాప్రతినిధులపై ఉన్న ఇలాంటి కేసులను ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే విచారించి త్వరగా శిక్షలు ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, న్యాయస్థానాలను ఏడీఆర్ కోరింది.

రేకుల షెడ్డు కింద చదువులు.. స్పందించిన నారా లోకేశ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha