HDFC : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ 'నారీ నివేశ్ యాత్ర'ను తిరుపతిలో విజయవంతంగా నిర్వహించింది. చెన్నైలో జూన్ 26న ప్రారంభమైన ఈ ఆరు నెలల ప్రచార కార్యక్రమం, కమ్యూనిటీల స్థాయికి వెళ్లి మహిళలకు ఆర్థిక నిర్ణయాలపై అవగాహన కల్పిస్తోంది.
తిరుపతిలోని కోర్లకుంట, లీలామహల్, గాంధీ రోడ్ వంటి ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేక కాంటర్ వాహనాల ద్వారా వీధి నాటకాలు, ఇంటరాక్టివ్ సదస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) 60కి పైగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, కుటుంబ ఆర్థిక ప్రణాళిక మరియు సంపద సృష్టిలో మహిళల కీలక పాత్రను ఎత్తిచూపారు.
HDFC Banking Services Downసంప్రదాయ పొదుపు నుంచి SIP పెట్టుబడుల వైపు – సురక్షిత మార్గదర్శకాలు
గృహిణులు మరియు ఉద్యోగినులు కేవలం సంప్రదాయ డబ్బా పొదుపు (బర్నీ)కే పరిమితం కాకుండా, మ్యూచువల్ ఫండ్స్ వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించేందుకు ‘బర్నీ సే ఆజాది’ భావనతో ఈ యాత్రను రూపొందించారు. ఇందులో భాగంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు, కాంపౌండింగ్ ప్రయోజనాలను సులభమైన రీతిలో వివరించారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి అవసరమైన కేవైసీ (KYC) పూర్తి చేసే విధానం, సెబీ ఆమోదిత నిబంధనలు మరియు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి అందుబాటులో ఉన్న స్కోర్స్ (SCORES), స్మార్ట్ ఓడీఆర్ (Smart ODR) వంటి డిజిటల్ వేదికల వినియోగంపై మార్గదర్శనం చేశారు. ప్రతీ పెట్టుబడి నిర్ణయానికి ముందు స్కీమ్ పత్రాలను క్షుణ్ణంగా చదవాలని ఈ సందర్భంగా నిపుణులు సూచించారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకుల కార్యకలాపాలు

