మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎమ్మెల్యే
Kalyandurgam MLA: ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ వ్యాపారవేత్తగా ఎదిగి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు.
బుధవారం ప్రజావేదికలో సెర్ప్ పీడీ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సంఘాల యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
ఈ కార్యక్రమంలో మహిళలతో కలిసి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని 209 మంది గ్రామ సంఘాల యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు అందాల్సిన స్త్రీనిధి రుణాలు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
పొదుపు అలవాటు పెంచుకోవాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పొదుపు, ఆర్థిక క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని మహిళలకు సూచించారు.
Kalyandurgam MLAరూ.500 కోట్ల రుణాల లక్ష్యం
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పటివరకు మహిళా సంఘాలకు సుమారు రూ.200 కోట్ల రుణాలు అందించామని తెలిపారు.భవిష్యత్తులో వాటిని రూ.500 కోట్లకు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
ఫాస్ట్ ఫుడ్ బండ్ల పంపిణీ
నెక్ ఆధ్వర్యంలో కంబదూరు, కుందుర్పి, శెట్టూరు మండలాలకు ఉచితంగా అందించిన ఎగ్ కార్ట్ ఫాస్ట్ ఫుడ్ బండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ బండ్లు మహిళల జీవనోపాధి అభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

