Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైదానంలో కోహ్లీ 'పెద్ద మనసు'కు ఫ్యాన్స్ ఫిదా

మైదానంలో కోహ్లీ 'పెద్ద మనసు'కు ఫ్యాన్స్ ఫిదా

వార్త 3 months ago

Virat Kohli: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను మళ్లీ అందుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి విమర్శలు ఎదుర్కొన్న 'కింగ్', బుధవారం రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బౌలర్లను ఉతికి ఆరేశాడు.

Read Also:Mumbai Indians Captaincy: ముంబయి ఇండియన్స్ కొత్త కెప్టెన్ మార్పుపై ఉత్కంఠ!

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ సెంచరీ ధాటికి ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

 RCB vs KKR IPL 202

యువ పేసర్‌కు క్షమాపణ..

ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌తోనే కాదు, తన ప్రవర్తనతోనూ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో ఒక సింగిల్ తీసే క్రమంలో కోహ్లీ.. కేకేఆర్ అరంగేట్ర పేసర్ హర్ష్‌దూబేను అనుకోకుండా ఢీకొట్టాడు.సింగిల్ పూర్తి చేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోహ్లీ ఆ యువ బౌలర్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు.హర్ష్‌దూబే కూడా చిరునవ్వుతో కోహ్లీని హగ్ చేసుకుని ‘పర్వాలేదు’ అని బదులిచ్చాడు.

ఫ్యాన్స్ ఫిదా.. నెట్టింట ప్రశంసల జల్లు

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదేనని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “ఒక లెజెండరీ బ్యాటర్ అయ్యి ఉండి, అరంగేట్రం చేసిన యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పడం కోహ్లీ గొప్పతనానికి నిదర్శనం” అని నెటిజన్లు కొనియాడుతున్నారు. అప్‌కమింగ్ క్రికెటర్లు కోహ్లీ నుంచి క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తిని నేర్చుకోవాలని సీనియర్ క్రికెటర్లు సైతం హితవు పలుకుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

జీతాల పెంపుపై వస్తున్న వార్తలు అబద్ధం.. ప్యాట్ కమిన్స్ స్పష్టత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha