Tilak Varma: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఒక ఆసక్తికరమైన , బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. సీఎస్‌కే బౌలర్ జేమీ ఓవర్టన్ వేసిన వేగవంతమైన బంతిని తిలక్ వర్మ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే టైమింగ్ మిస్ అవ్వడంతో బంతి నేరుగా తిలక్ ఎడమ చేతి మణికట్టుకు బలంగా తగిలింది.
Read Also:IPL 2026 : ఆమె మాయలో పడ్డాడంటూ హార్దిక్ పై ఫ్యాన్స్ ఫైర్..
Tilak Varma: ఎగిరిపడ్డ హూప్ (WHOOP) బ్యాండ్
బంతి తగిలిన వేగానికి తిలక్ చేతికి ఉన్న ఖరీదైన WHOOP ఫిట్‌నెస్ బ్యాండ్ ఒక్కసారిగా ఊడిపోయి దూరంగా పడిపోయింది. ఈ బ్యాండ్ కేవలం వాచ్ మాత్రమే కాదు, ఇది అథ్లెట్ల హృదయ స్పందన రేటు, నిద్ర ,రికవరీని ట్రాక్ చేసే అత్యాధునిక పరికరం. దీని ధర, సబ్‌స్క్రిప్షన్ విలువ వేలల్లో ఉంటుందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వాచ్ పడిపోయిన ఘటన జరిగిన రెండు బంతులకే తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు. ఆ దెబ్బ ప్రభావమో లేక ఏకాగ్రత దెబ్బతిందో కానీ, కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేయగా, చెన్నై జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), కార్తీక్ శర్మ (54 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి ముంబైని చిత్తు చేశారు.
బంతి తగిలిన వెంటనే తిలక్ వర్మ నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ముంబై ఫిజియో మైదానంలోకి వచ్చి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే కష్టాల్లో ఉన్న తరుణంలో, కీలక బ్యాటర్ తిలక్ వర్మకు గాయం కావడం అభిమానులను ఆందోళనలో పడేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
చెపాక్‌లో ముంబై చిత్తు.. CSK హిస్టారికల్ విక్టరీ

