Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మైనర్ బాలికపై అఘాయిత్యం.. బిల్డింగ్ పైనుంచి తోసేసిన దుర్మార్గుడు!

మైనర్ బాలికపై అఘాయిత్యం.. బిల్డింగ్ పైనుంచి తోసేసిన దుర్మార్గుడు!

వార్త 4 days ago

Khammam Crime: ఖమ్మం నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 12 ఏళ్ల మైనర్ బాలికను నమ్మించి, ఓ కిరాతకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తన అకృత్యాన్ని దాచేందుకు, సదరు నిందితుడు ఆ బాలికను అపార్ట్‌మెంట్ భవనం పైనుంచి కిందకు తోసేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోంది.

Read also:Mahabubabad Crime : మొబైల్ అలక ప్రాణం తీసింది

Khammam Crime: ఆలస్యంగా వెలుగులోకి.. పోలీసుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

Crime Against Minor

జూన్ 6న జరిగిన ఈ దారుణ సంఘటన మొదట ప్రమాదంగా భావించారు. భవనం పైనుంచి బాలిక ప్రమాదవశాత్తు కింద పడిపోయి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు నమ్మారు. అయితే, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలికపై అఘాయిత్యం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఒక వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించి, పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదై రోజులు గడుస్తున్నా నిందితుడిపై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని, అతడిని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

బిర్యానీ వివాదం..తీవ్ర విషాదానికి దారి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha