Ramachandrapuram temple priest: దేవాలయంలో మైనర్ బాలికపై పూజారి అఘాయిత్యం చేసిన ఘటన తెలంగాణలోని రామచంద్రాపురంలో సంచలనం సృష్టించింది. సండే మార్కెట్ సమీపంలోని అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి వేళ ఈ దారుణం చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజారిగా పనిచేస్తున్న సాయిలు అనే వ్యక్తిపై కొంతకాలంగా స్థానికుల్లో అనుమానాలు ఉన్నాయి. ఆలయానికి వచ్చే వారిపై అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే, రామచంద్రాపురానికి చెందిన ఒక మైనర్ బాలికపై అతను అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు
Read Also :Excise SI Anil Suspicious Death : అనుమానాస్పద స్థితిలో ఎక్సైజ్ ఎస్ఐ అనిల్ మృతి
పూజారి వ్యవహారంపై కాపుకాసిన స్థానికులు, బాలికపై అతను అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు పూజారిని బంధించి, దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు.
Ramachandrapuram temple priest: POCSO చట్టం కింద కేసు!

ఘటనపై ఫిర్యాదు అందుకున్న రామచంద్రాపురం పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుడైన పూజారి సాయిలును అదుపులోకి తీసుకుని, బాధితురాలి స్టేట్‌మెంట్ మరియు మెడికల్ రిపోర్ట్ ఆధారంగా పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. దేవాలయం వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి దారుణం జరగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సోషల్ మీడియా, యాప్‌ల వేదికగా సైబర్ నేరాలు - పోలీసులకు సవాళ్లు

