Malla Reddy University:హైదరాబాద్‌లోని మల్లారెడ్డి డీమ్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సెలవు ప్రకటించి సినిమా ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించడంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సదరు యాజమాన్యానికి త్వరలోనే నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నట్లు స్పష్టం చేసింది.
Miyapur lands: 20 వేల కోట్ల మియాపూర్ భూములు సర్కారువేనా?

విద్యార్థి సంఘాల ఫిర్యాదు - విచారణకు విద్యామండలి నిర్ణయం
కళాశాల తరగతులను రద్దు చేసి వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఎస్‌ఎఫ్‌ఐ (SFI) రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ బృందం గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించింది. దీనిపై తక్షణమే స్పందించిన ఛైర్మన్, ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరిపి నివేదిక సేకరిస్తామని, యూనివర్సిటీకి నోటీసులు పంపుతామని హామీ ఇచ్చారు.
క్యాంపస్‌లలో భద్రత కోసం కొత్త చట్టం రూపకల్పన
మరోవైపు, రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల రక్షణను ముమ్మరం చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే దిశగా ఉన్నత విద్యామండలి అడుగులు వేస్తోంది. ఇటీవల ఎంవీఎస్‌ఆర్ (MVSR) ఇంజనీరింగ్ కాలేజీలో దాండియా వేడుకల సమయంలో లైటింగ్ ఆర్చ్ కూలి పడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటనను తీవ్రంగా పరిగణించిన విద్యామండలి, క్యాంపస్ విద్యార్థుల సురక్షిత విధివిధానాలపై కొత్త బిల్లు ముసాయిదాను తయారు చేసింది.
Malla Reddy University:నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సిద్ధం చేసిన ఈ నూతన ముసాయిదా ప్రతిపాదనలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌లకు అందజేసినట్లు ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా నిబంధనలను అతిక్రమించినా కఠిన శిక్షలు అమలు చేసేలా ఈ ప్రతిపాదనలు సవరించినట్లు వెల్లడించారు.
Epaper: epaper.vaartha.com

