Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. నేటి గోల్డ్ రేట్లు ఇవే

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. నేటి గోల్డ్ రేట్లు ఇవే

వార్త 3 weeks ago

Gold Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు పతనమైన గోల్డ్ రేట్లు, అక్టోబర్ 2 శుక్రవారం నాడు మళ్లీ పెరిగాయి.

సెప్టెంబర్ నెలలో భారీగా పడిపోయిన ధరలు ఈ నెలలో ఏ విధంగా నమోదవుతాయనేది కొనుగోలుదారులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : Cement Prices: అక్టోబర్‌లో మళ్లీ పెరగనున్న సిమెంట్ ధరలు!

 Gold prices rise again… here are today’s rates.

Gold Rates: దేశీయ మార్కెట్‌లో గ్రాము బంగారం ధరల వివరాలు

నేడు దేశంలో ప్రతి కేటగిరీ బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. పసిడి రకాలను బట్టి గ్రాము, 100 గ్రాముల ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

  • 24 క్యారట్లు: గ్రాము ధర రూ.104 పెరిగి రూ.15,028 వద్ద ట్రేడ్ అవుతుండగా, 100 గ్రాముల ధర రూ.10,400 పెరిగి రూ.15,02,800 వద్దకు చేరింది.
  • 22 క్యారట్లు: గ్రాము ధర రూ.95 పెరిగి రూ.13,775 వద్ద నమోదవ్వగా, 100 గ్రాముల ధర రూ.9,500 పెరిగి రూ.13,77,500కి చేరింది.
  • 18 క్యారట్లు: గ్రాము ధర రూ.78 పెరిగి రూ.11,271 గా ఉండగా, 100 గ్రాముల ధర రూ.7,800 పెరిగి రూ.11,27,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ముఖ్య నగరాల్లో 10 గ్రాముల తులానికి సంబంధించిన 24 క్యారట్లు, 22 క్యారట్లు, 18 క్యారట్ల బంగారం రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారట్ల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1,50,280 కాగా, 22 క్యారట్ల ధర రూ.950 పెరిగి రూ.1,37,750 వద్దకు చేరింది. 18 క్యారట్ల ధర రూ.780 పెరిగి రూ.1,12,710 గా నమోదైంది.
  • ముంబై, బెంగళూరు, కోల్‌కతా: 24 క్యారట్ల ధర రూ.1,50,280, 22 క్యారట్ల ధర రూ.1,37,750 మరియు 18 క్యారట్ల ధర రూ.1,12,710 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
  • ఢిల్లీ: 24 క్యారట్ల ధర రూ.1,50,450, 22 క్యారట్ల ధర రూ.1,37,900 కాగా, 18 క్యారట్ల ధర రూ.1,12,860 గా ఉంది.
  • చెన్నై: 24 క్యారట్ల ధర రూ.1,50,280, 22 క్యారట్ల ధర రూ.1,37,750 కాగా, 18 క్యారట్ల ధర రూ.1,13,170 నమోదు చేసుకుంది.
  • అహ్మదాబాద్: 24 క్యారట్ల ధర రూ.1,50,350, 22 క్యారట్ల ధర రూ.1,37,800 మరియు 18 క్యారట్ల ధర రూ.1,12,760 వద్ద ట్రేడ్ అవుతోంది.

దివ్యాంగులకు టోల్ ఫీజు మినహాయింపు.. నేటి నుంచే కొత్త రూల్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha