Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మళ్లీ యుద్ధం ఎందుకంటే?

మళ్లీ యుద్ధం ఎందుకంటే?

వార్త 0 months ago

Iran Vs US War: ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడిచమురు (Crude Oil) మరియు ఎల్‌పీజీ (LPG) వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) పై పూర్తి ఆధిపత్యం సాధించాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగానే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఆ జలసంధి గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌకపై చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి, ఒక్కో నౌకకు దాదాపు 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లకు పైగా) భారీ టోల్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. అయితే, ఈ దోపిడీ నుంచి తప్పించుకోవడానికి ఒమన్ దేశ తీరానికి సమీపంలో గల ప్రత్యామ్నాయ ‘బైపాస్ రూట్’ (Southern Corridor) ను అంతర్జాతీయ నౌకలు ఉపయోగించడం మొదలుపెట్టాయి. ఈ మార్గం ద్వారా చాలా నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తుండటంతో, తమ ఆర్థిక ప్రయోజనాలకు గండి పడుతోందని ఆగ్రహించిన ఇరాన్.. ఒమన్ తీరానికి దగ్గరగా ప్రయాణిస్తున్న మూడు అంతర్జాతీయ నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు తెగబడింది.

రంగంలోకి అమెరికా.. దాడులు, ప్రతిదాడులతో యుద్ధ వాతావరణం

అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలకు స్వేచ్ఛను హరించడం మరియు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) రంగంలోకి దిగి, ఇరాన్ తీరప్రాంతంలోని దాదాపు 80 నుంచి 90 సైనిక స్థావరాలు మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై శరపరంపరగా వైమానిక దాడులు చేసింది. అమెరికా వైమానిక దాడులతో పాటు ఇరాన్‌పై తిరిగి చమురు ఆంక్షలను విధించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం కూడా బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా నౌకాదళ, సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ భీకర దాడులు, ప్రతిదాడుల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, ఇది అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలకు దారితీసేలా కనిపిస్తోంది.

మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha