ఎన్నికల్లో ఎంత గొప్పనేత అయినా రాజకీయ పండితుడైనా ఓడిపోతే వెంటనే రాజీనామా చేయడం ఆనవాయితీ. అలా చేస్తేనే వారికి తగిన గౌరవం దక్కుతుంది. కాదూ కూడదు అంటే రాజ్యాధినేతలు తమకున్న రాజ్యాంగపు హక్కులను వినియోగించి, వారిని బర్తరఫ్ చేస్తారు.
అప్పటివరకు ఉన్న పరువు కాస్తా మంటకలిసిపోతుంది. సరిగ్గా పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలో ఇదే జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ అత్యధిక మెజార్టితో గెలుపొందింది. మమతా బెనర్జీ తను పోటీచేసిన స్థానంలో కూడా గెలవలేక దారుణంగా ఓడిపోయింది.
Read also: Tamil Nadu Government Formation: మెజార్టీ ఉంటే ఎవరినైనా ఆహ్వానిస్తా: గవర్నర్
BJP leaders celebration in West Bengal.
బెంగాల్‌లో ముగిసిన మమత పాలన
అయితే ఈ ఎన్నికలు బీజేపీ అక్రమాలతో గెలుపొందిందని, తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు మమత. ఇక ఆరాష్ట్ర గవర్నర్ తనకున్న రాజ్యాంగపు హక్కుల్ని వినియోగించి, మమతా బెనర్జీ సర్కార్ ను బర్తరఫ్ చేశారు. ఆమె మొండితనంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. గడువు ముగిసిన వెంటనే బెంగాల్ అసెంబ్లీని రద్దుచేశారు గవర్నర్. రేపు ఉదయం పదిగంటలకు బెంగాల్ లో తొలి బీజేపీ సర్కార్ కొలువు తీరనుంది. ఉదయం పదిగంటలకు బ్రిగేడ్ గ్రౌండ్స్ లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది. అమిత్ షా సమక్షంలో సీఎం ఎంపిక ఉంటుంది
సువేందు అధికారికే అధిక ఛాన్స్!
కాగా బెంగాల్ సీఎం ఎవరన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం రేసులో సువేందు అధికారి ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. భవానీపూర్ లో మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ తోషాతో పాటు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. బెంగాలీలకే సీఎం పదవి ఇస్తామని గతంలో అమిత్ షా వెల్లడించిన నేపధ్యంలో సువేందు అధికారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com

