Himanshu Rao Gym Injury: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు రావు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు.
నిన్న సాయంత్రం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అతడి ముక్కుకు స్వల్ప గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు హిమాన్షుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
Read Also : Himanshu Rao: కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయం.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్!
KCR calls on grandson Himanshu.
Himanshu Rao Gym Injury: చాలా రోజుల తర్వాత కనిపించిన కేసీఆర్
మనవడు హిమాన్షుకు గాయమై ఆసుపత్రిలో చేరాడన్న సమాచారం అందిన వెంటనే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి రోడ్డు మార్గాన ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా కంటికి చిక్కడంతో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆసుపత్రి పరిసరాల్లోకి భారీగా చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న హిమాన్షును కేసీఆర్ ఆత్మీయంగా పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం హిమాన్షు ఆరోగ్య పరిస్థితి మరియు అతడికి అందుతున్న చికిత్స వివరాలను అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
కుమారుడికి గాయమైన విషయం తెలిసినప్పటి నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసుపత్రిలోనే ఉంటూ హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా నిన్న రాత్రి నుంచే ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని కేటీఆర్ కుటుంబానికి తోడుగా ఉన్నారు. హిమాన్షు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, కేవలం చిన్నపాటి గాయం కావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు మరియు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష!

