Anantapur news: సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలోని ఆర్డీటీ(రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్) ఆసుపత్రిని గురువారం సాయంత్రం రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
అనంతపురం కేంద్రంగా సేవలందిస్తున్న ఆర్డీటీకి 2021లో ఎఫ్ సీఆర్ఎ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) రెన్యువల్ ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో విదేశీ నిధులు ఆగిపోవడంతో సేవా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ప్రజల జీవితాల్లో భాగమైన ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు.
Read also: Bengal Violence: బెంగాల్ హింస కేసులో స్వయంగా రంగంలోకి దిగిన దీదీ!
Nara Lokesh paying tribute at RDT
Anantapur news: నిలిచిన హామీ సేవలకు ఊపిరి
ప్రజా ప్రభుత్వం రాగానే మంత్రి లోకేష్ ఆర్డీటీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మంత్రి లోకేష్ చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆర్జీటీకి ఎఫ్ సీఆస్ఏ అనుమతులు మంజూరు చేసింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన నారా లోకేష్ కు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, ఆర్డీటీ హాస్పిటల్ హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ డాక్టర్ పి. లలితా దేవి, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక స్థానిక ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ సమాధిని సందర్శించిన మంత్రి లోకేష్.. ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

