Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ

మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ

వార్త 1 month ago

Andhra Pradesh: ఏపీ యోగా, నేచురోపతి విభాగం గౌరవ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సోమవారం మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

అయితే, ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read also: Tirumala: శ్రీవారిపై అపార భక్తి.. వెయ్యిసార్లు మెట్ల దారిలో నడిచిన రిటైర్డ్ టీచర్!

అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్

ప్రకృతి వైద్య రంగంలో గత కొన్ని దశాబ్దాలుగా మంతెన సత్యనారాయణ రాజు చేస్తున్న సేవలను మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా కొనియాడారు. ప్రజారోగ్యం పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ, అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్య విభాగాలను మరింత బలోపేతం చేసే దిశగా మంతెన సలహాలు కీలకమవుతాయని ఆకాంక్షించారు.

కేబినెట్ హోదాతో పెరిగిన బాధ్యత

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మంతెన సత్యనారాయణ రాజును యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా నియమిస్తూ కేబినెట్ హోదాను కల్పించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటిసారిగా మంత్రిని కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

విద్యార్థులకు పౌష్టికాహారం.. రాగిజావ పంపిణీ మరో మూడేళ్లు పొడిగింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha