Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మన్యం అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం

మన్యం అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం

వార్త 2 months ago

Seethanagaram news:తూడ్గూ జిల్లాలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంత పరిసరాల్లో ఒక భారీ పులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

మన్యం అడవుల్లో ఈ పులి అడవి పంది పిల్లలను వేటాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Read also: Andhra paper mills: ఆంధ్రా పేపర్ మిల్స్‌కు షోకాజ్ నోటీసులు: పవన్ ఆదేశాలు

 tiger in manyam forest area movement

గుర్తించిన ప్రాంతాలు ఇవే

సీతానగరం మండలం రాయదుర్గం కొండ ప్రాంతంలో పులి అడుగుజాడలను అధికారులు స్పష్టంగా గమనించారు. పురుషోత్తపట్నం అలాగే నేలకోట గ్రామ పరిసరాల్లో కూడా పులి తిరుగుతున్నట్లు ఆధారాలు లభించాయి. అటవీశాఖ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పులి ఎటువైపు వెళ్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Seethanagaram news:అప్రమత్తంగా ఉండాలి

స్థానిక ప్రజలు పొలాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు. మూగజీవాలను కాపాడుకోవాలని పశువుల కాపరులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఏదైనా అనుమానాస్పద అడుగుజాడలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అధికారులు కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆగస్ట్ 15 నుండి సంజీవని పథకం అమలు: చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha