Ayatollah Ali Khamenei: ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులకు చివరి వీడ్కోలు కార్యక్రమాలు వారు మరణించిన దాదాపు నాలుగు నెలల తర్వాత శుక్రవారం(జూలై 3) ప్రారంభమయ్యాయి.
జూలై 3 నుంచి జూలై 9 వరకు జరిగే అంత్యక్రియల కార్యక్రమాల షెడ్యూల్‌ను జూన్ 13న ఇరాన్ ప్రకటించింది. ఇవాళ్టి(జూలై 4) నివాళి కార్యక్రమానికి పలు దేశాల ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. అలీ ఖమేనీ, ఆయన కుటుంబంలోని ముగ్గురు సభ్యులను ఇరాన్ జెండా కప్పి ఉంచిన శవపేటికలో ‘గ్రాండ్ మొసల్లా’కు తీసుకువెళ్లారు. తెహ్రాన్‌లోని ప్రధాన మత, సాంస్కృతిక కేంద్రమైన ఇమామ్ ఖొమేనీ మసీదులో తుది వీడ్కోలు కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. నల్లటి దుస్తులు ధరించిన ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఎర్రటి పువ్వులు, వేలాడదీసిన తెల్లటి సీతాకోకచిలుకల అలంకరణ మధ్య శవపేటికను ఉంచారు. ఈ తుది వీడ్కోలు కార్యక్రమాన్ని ఇరాన్ కేవలం ఒక మతపరమైన ఆచారంగానే కాకుండా, యుద్ధం తర్వాత తన రాజకీయ, దౌత్యపరమైన శక్తిని ప్రదర్శించే ఒక ప్రధాన వేదికగా కూడా పరిగణిస్తోంది.
Read Also: Khamenei Funeral: టెహ్రాన్‌లో సుప్రీం లీడర్ ఖమేనీకి భావోద్వేగభరితంగా నివాళులు!
Ayatollah Ali Khamenei
జాతీయ సెలవు దినంగా జూలై 6
జూలై 4, 5 తేదీలు తెహ్రాన్‌లో సెలవు కాగా, జూలై 6 జాతీయ సెలవు దినంగా ప్రకటించినట్టు నిర్వాహక కమిటీ అధిపతి, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ చెప్పారు. ఈ కార్యక్రమాలకు కోటీ 20 లక్షల మంది నుంచి కోటీ 50 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారని, అయితే ఈ సంఖ్య రెండు కోట్లకు కూడా చేరవచ్చని తెహ్రాన్‌లో కార్యక్రమాల భద్రతను పర్యవేక్షిస్తున్న ఐఆర్‌జీసీ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ హసన్ హసన్‌జాదే చెప్పారు. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినట్టు, 10 సైనిక ఆసుపత్రులను సన్నద్ధంగా ఉంచినట్టు సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అకరామినియా తెలిపారు. అదనంగా లక్షన్నర మంది పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. జూలై 6న తెహ్రాన్ గగనతలాన్ని, జూలై 9న మషద్ నగరం గగనతలాన్ని మూసివేస్తారు.
Ayatollah Ali Khamenei: షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరాలుగా నజఫ్, కర్బలా
మక్కా, మదీనా తర్వాత నజఫ్, కర్బలా షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరాలుగా పరిగణిస్తారు. నజఫ్‌లో మొదటి షియా ఇమామ్, ప్రవక్త ముహమ్మద్ బంధువు అయిన ఇమామ్ అలీ సమాధి ఉంది. కర్బలాలో ఇమామ్ హుస్సేన్ సమాధి ఉంది. కర్బలా యుద్ధంలో ఆయన అమరత్వం షియా ముస్లింల విశ్వాసానికి, మత సంప్రదాయానికి కేంద్రంగా పరిగణిస్తారు. ఇరాక్ గిరిజన నాయకులు, మత పెద్దలు, మేధావులు, రాజకీయ ప్రముఖుల అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమ ఏర్పాట్లు జరిగాయని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. జూన్ 28న బాగ్దాద్ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ కార్యక్రమాల నిర్వహణలో సహకరించినందుకు ఇరాక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన సంబంధాల బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.
Epaper: epaper.vaartha.com
ప్రధాని మోదీ తొలి న్యూజిలాండ్ పర్యటన - భారత్-కివీస్ ద్వైపాక్షిక చర్చలు

