Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
March Holidays: మార్చి నెలలో వరుస సెలవుల జాబితా

March Holidays: మార్చి నెలలో వరుస సెలవుల జాబితా

వార్త 3 months ago

March Holidays: మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులకు వరుసగా సెలవులు లభించనున్నాయి. వారాంతాలు, ముఖ్య పండుగలు కలిసి దాదాపు 11 రోజుల వరకు స్కూళ్లు, కాలేజీలకు విరామం లభించనుంది.

దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.ఈ మేరకు మార్చి 1, 8, 15, 22, 29 తేదీలలో ఆదివారం కావడంతో ఆ రోజులలో విద్యార్థులకు సెలవు ఉండనుంది. ఆ తర్వాత మార్చి 4న హోలీ పండుగ, 14న రెండో శనివారం, 19న ఉగాది పండుగ, 20వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ఉండనుంది. మార్చి 26న శ్రీరామనవమి రోజున సెలవు ఉండనుండగా 31న మహావీర్ జయంతి కావున కొన్నిచోట్ల ఆప్షనల్ హాలీడే ఇవ్వనున్నారు.

CM Revanth : అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం - రేవంత్

ఒంటి పూట బడులు ప్రారంభం

మరోవైపు మార్చి 16వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాలలోని పాఠశాలల్లో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ, తెలంగాణ విద్యాశాఖలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాయి. మార్చి 16వ తేదీ నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ తరగతులు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి జరిగే కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి తరగతులు నిర్వహిస్తారు. మరోవైపు మార్చి 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha