Telangana New ORR Projects: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి అభివృద్ధిని సాధించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ‘మెగా గ్రోత్ కారిడార్’ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also : Telangana Parking Rules: రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్ చేస్తున్నారా.. ఇక జాగ్రత్త!
A new plan for the development of Telangana with mega growth corridors.
Telangana New ORR Projects: మూడు కొత్త ఔటర్ రింగ్ రోడ్లు
హైదరాబాద్ తరహాలోనే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ల (ORR) నిర్మాణాన్ని చేపట్టాలని మున్సిపల్ శాఖకు సీఎం సూచించారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే 25 ఏళ్ల భవిష్యత్తుకు అనుగుణంగా వీటిని డిజైన్ చేయాలని స్పష్టం చేశారు.
టూరిజం కారిడార్లు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు:
- మహబూబ్‌నగర్ – భూత్పూర్ – జడ్చర్ల, ఈ మూడింటిని కలుపుతూ ఒక గ్రోత్ కారిడార్.
- కొత్తగూడెం – పాల్వంచ – సుజాతనగర్, పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక కారిడార్.
- టెంపుల్ కారిడార్, నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య ఆధ్యాత్మిక అభివృద్ధి.
- టూరిజం కారిడార్, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ పర్యాటక రంగం అభివృద్ధి.
- జోగులాంబ, కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ ఆలయానికి ప్రత్యేక ప్లాన్.
- విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాలు
- రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రణాళికలు ఉండాలని సీఎం పేర్కొన్నారు.
- వరంగల్ ఎయిర్‌పోర్ట్, ఈ విమానాశ్రయం రాకతో ఉత్తర తెలంగాణ ముఖచిత్రం మారనుందని, దానికి అవసరమైన నీటి వసతులపై దృష్టి పెట్టాలన్నారు.
- ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్, రక్షణ శాఖ ఆధ్వర్యంలో దీని ఏర్పాటు జరగనుంది.
- సింగరేణి యూనిట్, సింగరేణి పరిధిలోని మున్సిపాలిటీలను ఒకే యూనిట్‌గా అభివృద్ధి చేసి, CSR నిధులను అక్కడే ఖర్చు చేయాలని ఆదేశించారు.
- గ్రీన్ ఎనర్జీ మరియు టెక్నాలజీ వినియోగం
గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వినియోగం
కాలుష్యం తగ్గించడానికి, ఖర్చులు ఆదా చేయడానికి కొత్త ప్రతిపాదనలు చేశారు:
- మున్సిపాలిటీల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలి. లీజుకు తీసుకునేవి కూడా ఈవీలే ఉండాలి.
- ప్రతి మున్సిపాలిటీలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పునరుత్పాదక శక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగించాలి.
- రేడియేషన్ తగ్గించేందుకు మల్టీ యుటిలిటీ టవర్స్, స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి.
- భూగర్భ డ్రైనేజీ, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (STP) ప్రతి గ్రోత్ కారిడార్‌లో తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

