Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న రెహమాన్

మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న రెహమాన్

వార్త 1 week ago

AR Rahman : భారతీయ చలనచిత్ర సంగీత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ముంగిట మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం వాలింది.

అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ అచీవ్‌మెంట్’ ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ ప్లేట్ అవార్డు (Golden Plate Award) ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో వైభవంగా జరిగిన 56వ ఇంటర్నేషనల్ అచీవ్‌మెంట్ సమ్మిట్‌లో రెహమాన్ ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వయంగా అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ, సమాజంపై సానుకూల ప్రభావం చూపుతూ, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మహోన్నత వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డును అందజేస్తారు. ఈ అంతర్జాతీయ గౌరవంతో రెహమాన్ కీర్తికిరీటంలో మరొక అపురూపమైన రత్నం చేరినట్లయింది.

భారతదేశానికి అవార్డు అంకితం.. అంతర్జాతీయ వేదికపై రెహమాన్ దేశభక్తి

ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం ఏఆర్ రెహమాన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ గ్లోబల్ గౌరవాన్ని తన మాతృభూమి అయిన భారతదేశానికి అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించి తన దేశభక్తిని చాటుకున్నారు. సంగీత ప్రపంచంలో దశాబ్దాలుగా సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తూ, కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న రెహమాన్‌కు ఈ అవార్డు దక్కడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు భారతీయ చిత్రపరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. సైన్స్, కళలు, ప్రజా సేవ, క్రీడలు మరియు వ్యాపార రంగాలలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మేధావులకు ఇచ్చే ఈ గోల్డెన్ ప్లేట్ అవార్డును గతంలో పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రపంచ దేశాల అధినేతలు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆ ప్రతిష్ఠాత్మక జాబితాలో రెహమాన్ చేరడం భారతీయులందరికీ గర్వకారణం.

మహిళల డ్రెస్సింగ్ పై సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు వైరల్ !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha