Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరో తుఫాన్ ఏర్పడబోతుందా ?

మరో తుఫాన్ ఏర్పడబోతుందా ?

వార్త 6 days ago

Low-Pressure Area : ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవలే వాయుగుండం తీవ్రంగా కలవరపెట్టగా, తాజాగా బంగాళాఖాతంలో మరొక నూతన తుఫాను ముప్పు పొంచి ఉందంటూ వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

ఈ నెల 28వ తేదీ తర్వాత థాయ్‌లాండ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం తీవ్రమై ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో క్రమంగా తీవ్రమైన అల్పపీడనం ఏర్పడి, తదుపరి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల (అక్టోబర్) రెండో వారంలో ఇది తుఫాను (Cyclone)గా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీరం దాటే దిశపై రాని స్పష్టత: తీవ్ర పర్యవేక్షణలో వాతావరణ శాఖ

అల్పపీడనం తుఫానుగా మారే అవకాశమున్నప్పటికీ, దీని వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర పొరుగు రాష్ట్రాలపై ఎలాంటి తీవ్ర ప్రభావం ఉంటుంది అనే అంశంపై అధికారులకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. వ్యవస్థ రూపుదిద్దుకున్న తర్వాత మాత్రమే ఇది ఏ తీరం వైపు పయనిస్తుంది, ఎంత తీవ్రతతో వర్షాలు పడతాయి అనే దానిపై స్పష్టమైన అంచనాకు రాగలమని నిపుణులు పేర్కొన్నారు. అయితే గతంలో సంభవించిన వర్షాల నుంచే కోలుకుంటున్న తీరప్రాంత ప్రజలు మరియు రైతులు, ఈ కొత్త అల్పపీడన హెచ్చరిక వార్తలతో తీవ్ర కలవరానికి గురవుతున్నారు. పరిస్థితులను వాతావరణ శాఖ నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తోంది.

స్థానిక ఎన్నికల సన్నాహాలపై పవన్ సమీక్ష.. కమిటీకి కీలక ఆదేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha