North Korea: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన దురాక్రమణ ధోరణిని మరోసారి ప్రదర్శించారు. ఆదివారం ఉదయం ఉత్తర కొరియా జరిపిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపింది.
ఏప్రిల్ నెలలోనే ఇది నాలుగో ప్రయోగం కావడం గమనార్హం.
Read Also:Strait of Hormuz: యూరోపియన్ యూనియన్ తీరుపై ఇరాన్ ఆగ్రహం
North Korea: ఏం జరిగింది?
ఈ క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) వెలుపల సముద్రంలో పడ్డాయి. జపాన్ ప్రధాని సనాయే తకైచి వెంటనే అత్యున్నత స్థాయి భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.ఉత్తర కొరియా తూర్పు తీర నగరమైన సిన్పో నుండి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు ఏఎన్ఐ నివేదించింది.ఆదివారం ఉదయం 6:10 గంటల ప్రాంతంలో ఈ ప్రయోగాలు జరిగాయి.
అమెరికా-దక్షిణ కొరియా ఉమ్మడి దర్యాప్తు
ఈ క్షిపణి సామర్థ్యం ఎంత? దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? అనే కోణంలో అమెరికా, దక్షిణ కొరియా మరియు జపాన్ దేశాలు కలిసి దర్యాప్తు చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను కిమ్ జోంగ్ ఉన్ మరోసారి బేఖాతరు చేయడంపై అంతర్జాతీయ వేదికలపై చర్చ మొదలైంది.
వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ కానున్న తరుణంలో కిమ్ ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఈ కీలక సమావేశంపై ఒత్తిడి తెచ్చేందుకే కిమ్ తన సైనిక బలాన్ని ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) సైతం ఉత్తర కొరియా అణు సామర్థ్యాలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయని హెచ్చరించింది. తన దేశం ఇప్పుడు ఒక పూర్తిస్థాయి “అణుశక్తి” అని, ఆ హోదా నుండి వెనక్కి తగ్గేది లేదని కిమ్ జోంగ్ ఉన్ పదేపదే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి జపాన్, దక్షిణ కొరియా దేశాలు తమ సరిహద్దుల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ఇటలీలో కాల్పుల కలకలం: వైశాఖి వేడుకల్లో ఇద్దరు భారతీయుల దారుణ హత్య

