Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్

మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్

వార్త 9 hrs ago

DMK Stalin comments to Vijay Govt : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ కొత్త ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కాలం మనుగడ సాగించడం అసాధ్యమని డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత విజయ్ ప్రభుత్వం తమ పార్టీ దయ మరియు సహకారంపైనే నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక రాజకీయ మార్పుగా భావించలేమని, ఇది కేవలం ఒక నటుడిపై ఉన్న తాత్కాలిక క్రేజ్ వల్ల వచ్చిన “సినిమా సునామీ” మాత్రమేనని కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

Read Also : పెరుగుతున్న పిల్లల మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

 TVK Vijay

సినిమా సునామీ తాత్కాలికమే.. ప్రజలు మళ్లీ డీఎంకే వైపే!

స్టాలిన్ తన ప్రసంగంలో విజయ్ ప్రభుత్వ భవిష్యత్తుపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. సినిమా గ్లామర్‌తో వచ్చే ఉత్సాహం ఎంతో కాలం నిలవదని, కొద్దిరోజులకే ప్రజల్లో ఆ ఆసక్తి తగ్గిపోతుందని ఆయన విశ్లేషించారు. పరిపాలనలో లోపాలు బయటపడినప్పుడు, అనుభవం ఉన్న నాయకత్వం విలువ ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. “కొన్నాళ్ల తర్వాత తల్లి కోసం బిడ్డ వెతికినట్లుగా, సుపరిపాలన కోసం తమిళ ప్రజలు మళ్లీ డీఎంకే కోసమే వెతుకులాడతారు” అంటూ స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో టీవీకే ప్రభుత్వం ప్రజాదరణను కాపాడుకోవడం అంత సులువు కాదని, డీఎంకే క్షేత్రస్థాయిలో మరింత బలంగా పుంజుకుంటుందని ఆయన కార్యకర్తల్లో జోష్ నింపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha