Petrol and diesel : లేదు లేదంటూనే, కాదు కాదంటూనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఇంధన వినియోగదారులపై కేంద్రం భారం మోపింది. దేశంలో పెట్రోల్, డీజిల్కు కొరత లేదంటూ వినియోగదారున్ని మభ్యపెట్టిన కేంద్రం మధ్యలో కొంతకాలం పెట్రోల్ బంక్లల దగ్గర హడావుడి సృష్టించింది.
ఇప్పటికే ఇంధన వినియోగంలో నూపొదుపు నియంత్రణ అవసరమంటూ ప్రధాని నరేంద్రమోడీ విని యోగదారులకు దిశానిర్దేశం చేశారు. ఇంధన విషయంలో ఇప్పటికే ఇంధన తయారీ సంస్థలు అటు వినియోగదారు లను ఇటు పెట్రో బంకుల యాజమానులను గందరగోళ పరచి రోడ్డెకించిన విషయం విదితమే. ప్రధానంగా ఈ నూతన పరిణామాల కారణంగా డీజిల్ ఆధారంగా పని చేసే యంత్రాలతో సాగుచేసే వ్యవసాయదారులపై సాగు ఖర్చులు పెరిగాయి. దానికితోడు ఉత్పత్తుల పెట్రోలు, రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమౌతోంది. సరకు రవాణా చేసే ట్రక్కులు పెట్రోల్, డీజిల్ కోసం ఎన్నో రోజులుగా రోడ్ పక్కన నిచిలి ఉన్న ట్రక్కు డ్రైవర్లు తాము గమ్యస్థానాలకు ఎప్పుడు చేరతామోనని కంగారు పడుతున్నారు. సామాన్య వాహన వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ సరఫరాపై ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also: Prices Hike: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు..గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె!
petrol and diesel
petrol and diesel : తట్టుకోలేని భారమే
అంతర్జాతీయ ముడి చమురుపై ధరలు బాగా పెంచేసినా వీటి వినియోగంపై రోజూ వెయ్యి కోట్లు నష్టం వాటిల్లుతోందని ప్రధాని ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వరంగ సంస్థలతో పోలిస్తే దేశంలోని ప్రయివేట్ గ్యాస్ స్టేషన్ ఆపరేటర్లు నయారా ఎనర్జీ లిమిటెడ్, షెల్ పిఎల వంటి కొన్ని సంస్థలు కొన్ని రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశా యి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సరఫరా పరిమితులను విధించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొ రేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు నేటి ఇంధన ధరల పెంపుతో కాస్తంత ఊరట లభించినట్లయింది. అవి కొంతకాలంగా పారిశ్రామిక అవసరాలపై డీజిల్ ధరలను లీటరుకు అర్థరూపాయి వరకు పెంచింది. జెట్ ఫ్యూయల్ ధరలుపెరిగిన కారణంగా పలు అంతర్జాతీయ రూట్లలో తమ విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. తాజాగా లీటరు పెట్రోలు, డీజిల్పై 3.04పైసలు పెంచగా, సిఎని లీటర్పై రూ. 2 మేరకు కేంద్రం పెంచింది. ఇదంతా సాధారణ వినియోగదారులు తట్టుకోలేని భారమే. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలను పెంచక తప్పదని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుగానే హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో 76రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. మరో ప్రత్యామ్నాయ ఇంధన అవసరాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
మానవుల నెత్తిన భారం
ప్రభుత్వరంగ చమురు సంస్థల నష్టాలు తగ్గించడం కోస మైనా ఇంధన ధరల పెంపు అనివార్యం. గత కొద్దికాలం గా పెట్రోసంస్థల విన్యాసాలతో పెట్రోల్ బంకులు మూత పడ్డాయి కూడా. ఇక పెట్రోలు, డీజిల్లను చూస్తామోలే మోనన్న భయంతో వాహనదారులు పెట్రోలు బంకుల వద్ద బారులు తీరడం, ఆనక కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్కు కొరతేమీ లేదని ప్రకటించడం జరిగిపోయాయి. ఏదో మాట వరసకలా’ అన్నట్లు కేంద్రం విశ్లేషించుకుంది తప్ప పెట్రోల్ బంక్ల వ్యవహారాన్ని చక్క పరచలేకపో యింది. అడపాదడపా కొన్ని ప్రాంతాల్లో ఇదే సీను. రిటైల్ అవుట్లెట్లలో నిరంతరాయంగా పెట్రోలు, డీజిల్ సరఫరా ఉండాలని సంకల్పించి మరికొన్ని విధాన నిర్ణ యాలు తీసుకొంది. గతంలో గ్యాస్ సరఫరా విషయం లోనూ గృహ వినియోగదారులకు నిత్యం గ్యాస్ సరఫరా అందుబాటులో ఉంచాలనే తలంపుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ఆంక్షలు విధించి లేనిపోని తల నొప్పులు తెచ్చుకుంది. ఆనాటి నిర్ణయంతో నిషేధాలు సాధారణ మానవుల నెత్తిన భారం పడింది. ఇకవాటి భారం నుంచి తప్పించగల వారెవరూ లేరు. రోజువారీ కూలీలు, అసంఘటిత కార్మికులు, బయట తినుబంరాలు ఆహారం మీద బతుకు వెళ్లేదీస్తే సామాన్య ప్రజానీకం మీద కోలుకోలేని బండపడింది.
petrol and diesel
పశ్చిమాసియా సెగ
కొరత నిజంగా ఉందో లేదోతెలియని ‘కమర్షియల్ గ్యాస్’బండలపై ఆంక్షలపేరిట సామాన్యుని నోటికాడ ముద్దకు ధరలు పెరిగిపోయాయి. తర్వాత అదేం లేదని చెప్పి నాలుక్కరచుకున్నారు. అయి నా ఇక తగ్గవుకాక తగ్గవు. ఇంధన సంక్షోభం ఓ కొలిక్కి వచ్చినా ఆహార తినుబండారాలపై పెరిగిన చార్జీలకు జనం అలవాటుపడిపోతారు. వ్యాపారస్థులకు వీధి వ్యాపారుల కు వాటి ధరలుతగ్గించే పరిస్థితిలేదు. తాజాగా పెట్రోలు, డీజిల్ బల్క్ అమ్మకాలపై ఆంక్షలు విధించి ‘గ్యాస్’ విష యంలో చేసిన తప్పేచేస్తోంది. కేంద్రం పెట్రోసంస్థల యాజమాన్యం పెట్రోల్ బంక్లకు రుణ ఆధారిత సర ఫరా వ్యవస్థలను ఉపసంహరించుకుని ముందస్తు చెల్లింపు నిబంధనలను ప్రవేశపెట్టడం వలన ఇంధన సర ఫరాలో గందరగోళం ఏర్పడింది. పెట్రోలు, డీజిల్ పంపిణీని స్థిరీక రించే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులకు 200 లీటర్ల డీజిల్పరిమితం చేసింది. ఒక్కో వాహనదారునికి రూ.5వేల రూపాయలు సరఫరా పరిమితి వలన కూడా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే సమయం లో పెట్రోలు, డీజిల్ ధరను కేంద్రం పెంచడం వినియోగ దారు మరో కొత్తరకం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్ తనచమురు అవసరాల్లో 80శాతం కన్నాఎక్కువ దిగుమతులపై ఆధారపడుతోంది. కనుక పశ్చిమాసియా సెగను తట్టుకోవల్సిందే. ఇలాంటి సమస్యలను క్రోడీకరిం చుకుని సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూసే యం త్రాంగాన్ని కేంద్రం తక్షణమే ఏర్పాటు చేసుకోవాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
