Dr. Mudigonda : కొందరు చరిత్రను సృష్టిస్తారు. మరికొందరు ఆ చరిత్ర ను రచిస్తారు. అయితే చరిత్ర రచనలో చరిత్రను సృష్టించేవారు అరుదుగా కనిపిస్తారు. వారిలో అగ్రగణ్యులు డా.
ముదిగొండ శివప్రసాద్. చరిత్రలోని ఎన్నో అంశాలను తీసుకొని ప్రామాణికత తగ్గకుండా రచనలు చేసినవారిసంఖ్య ఆధునికుల్లో వేళ్లమీద లెక్కించవచ్చు. చారిత్రక అంశాలతో నవలారచన చేసి ‘చారిత్రక నవలా చక్రవర్తి’ బిరుదు అందు కొన్నది కూడా ఆయనే. ‘ఎ జనరేషన్ విచ్ ఇగ్నోర్స్ హిస్టరీ హాజ్ నో పాస్ట్ నో ఫ్యూచర్’ అన్నాడు ప్రముఖ ఆంగ్ల రచ యిత రాబర్ట్ ఎ హెన్లైన్, అంటే చరిత్రను విస్మరించే వారికి గతమూ ఉండదు, భవిష్యత్తూ ఉండదన్నమాట, దానిని బాగా ఆకళింపు చేసుకొన్నందునో ఏమో! తాతలనాటి కథ లన్నీ తవ్వితీసి, వాటిలోని వాస్తవాలను వడబోసి, దానికి తన వర్ణనాశక్తిని జోడించి తెలుగు వారిగత వైభవచరిత్రను టన్నుల కొద్దీ పేర్చారు డా. ముదిగొండ. దేశభక్తి, జాతీయ సమైక్యతా దృష్టి ఉన్న రచయిత నుంచే వాస్తవికతను ప్రతి బింబించే రచనలు జాలువారుతాయి. ఆ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నందునే నాగానిక, శ్రీలేఖ, శ్రీపదార్చన, తంజావూరు వైభవం వంటి గొప్ప రచనలు చేయగలిగారని పిస్తుంది. ఆయన రచించిన 150 పైగా గ్రంథాలలో చరిత్ర కు దర్పణం పట్టేవి రెండు డజన్లుపైనే ఉన్నాయి. ఒక విశ్వనాథ, ఒకనోరి నరసింహశాస్త్రి తరహాలో ఒక ముదిగొండ అనిపించుకొన్నారు.
Dr. Mudigonda
Dr. Mudigonda : చారిత్రక రచనల్లోనే ఆణి ముత్యం
ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఒక చారిత్రక రచనల కొండ. ఆంధ్రుల చరిత్ర గురించి గతంలో అనేక మంది పండిత కవులు పలు గ్రంథాలు రచించినా వాటిలో కల్పితాలు ఎక్కువ. అందుకే అవి కావ్యాలుగా వన్నెకెక్కాయి. ఆ మార్గాన్ని ప్రక్షాళనం చేసి చరిత్రను వాస్త విక దృక్పథంతో అందించే ప్రయత్నం చేశారు ముదిగొండ. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర, తంజావూరు నాయకరాజులు, ముసునూరు రాజవంశాల చరిత్రలు తీసు కొని ఎన్నో నవలలుగా అందించారు. కేవలం శాతవాహను ల ఇతివృత్తాలతోనే ఆరు నవలలు రాశారు. కాకతీయులు కాలం నాటి చరిత్రను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసు కొన్నారు. ‘తంజావూరు విజయం’ చారిత్రక రచనల్లోనే ఆణి ముత్యం అనిచెప్పవచ్చు. ఆ ఒక్క పుస్తకం 3లక్షల ప్రతులు పైగా అమ్ముడయిందంటే ఆయన రచనలకు గల పాఠకాద రణ ఎంతటితో ఊహించుకోవచ్చు. హైందవజాతి వైభవోజ్వ ల చరిత్రను మధించి, తాను ఏర్పరచుకున్న బాటలోదానిని పదిమందికి పరిచయం చేయడానికి శ్రీలేఖ, శ్రావణి, నాగపూర్ణిమ, అమృతోదయం వంటి మేలిమి రచనలుచేశారు. చరిత్ర అంటే రాజులు, యుద్ధాలు, తేదీలు, వాటి సమాహా రంగా గాక ఆయా పాత్రలతో ఒక సజీవమైన కథగా రూ పొందించి, ఒక గొప్ప చరిత్రను తెలుసుకొన్నామనే అను భూతి పాఠకునిలో కలిగిస్తే రచయిత ప్రతిభకు అంతకు మించిన కొలమానం ఏముంటుంది!
‘ఆధునికాంధ్ర కవిత్వంపై ఉద్యమాల ప్రభావం’
ప్రాచీన భారతీయ, గ్రీకు సాహిత్యం, నాటకాలు, తత్వశాస్త్రాన్ని బాగా ఆకళింపు చేసుకొని, ఆసారాన్ని తెలుగు పాఠకులకు తగినట్లుగా అం దించారు ముదిగొండ, వంశధార, బనవగీత, గంగ నుంచి గంగవరకు, పుష్యమిత్ర వంటి రచనలు పరిశీలిస్తే ఇదే విష యం అర్థమవుతుంది. అందుకే ఆయన చారిత్రక రచనలు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథాలుగాగౌరవాన్ని అందుకొన్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపం లోని ఆకులల్లూరులో 1940లో జన్మించిన శివప్రసాద్ విశ్వవిద్యాల యంలో ప్రొఫెసర్గా పదవీ విరమణకుముందు కొన్ని పత్రికలకు సంపాద కత్వం కూడావహించారు. డా.సి. నారాయణ రెడ్డి మార్గదర్శకత్వంలో ‘ఆధునికాంధ్ర కవిత్వంపై ఉద్యమాల ప్రభావం’ అనే అంశంపై పరిశోధనతో డాక్టరేట్ పొందారు. ప్రాచీన ఆంధ్రుల రాజకీయ వైభవం, ధాన్యకటక ప్రాంత చరిత్ర, బౌద్ధసంస్కృతి, అప్పటి సామాజిక జీవన విధానాలు తెలియాలంటే క్రిలేఖ. శ్రావణి, వసంతగౌతమి వంటి రచనలు చదవాల్సిందే. ఆచార్య నాగార్జునుని కాలం నాటి చారిత్రక పరిస్థితులపై అవగాహన కలగాలంటే ‘నాగ పూర్ణిమ’ చదవాలి, కాకతీయుల చరిత్రపై కూడా ఎన్నో ప్రామాణిక రచనలు ఆయన చేశారు. వేయిస్తంభాల గుడిని నేపథ్యంగా తీసుకొని రాసిన ‘ఆవాహన’ నవల కాకతీయుల కాలం నాటి చారిత్రక పరిణామాతో ‘మాలిక్ కాఫర్’ నవల, నమ్మక్కసారలమ్మల చరిత్ర, తెలంగాణ ప్రాంత జానపద సంప్రదాయాల నేపథ్యంలో ‘చంద్రకళ’ వంటి రచనలు చేశారు. కాకతీయ సామ్రాజ్యపతనం తరువాత ఆంధ్రదేశ చరిత్రలో కీలకపాత్ర పోషించిన ముసునూరు నాయకుల చరిత్రను ‘అమృతోదయం’ ద్వారా ఆ పాఠకులకు అందించా రు. ఆయన పరిశోధనా వైదుష్యానికి ప్రతీకగా నిలిచిన గ్రంథం ‘కాకతీయ కళాదర్శనం.
కుర్తాళం పీఠాధిపతి చేతుల మీదుగా కనకాభిషేకం
ఆ కాలంలోని రాజ్యపా లన, సామాజిక వ్యవస్థ, సాహిత్య వికాసం, శిల్పకళ, ఆలయ నిర్మాణ సంప్రదాయాలు, సాంస్కృతిక జీవనాన్ని విస్తృతం గా విశ్లేషించిన పరిశోధనాత్మక రచన ఇది. నాయక రాజుల కాలంలోని తంజావూరు సాంస్కృతిక వైభవం, తెలుగుభాషా సాహిత్యాలకు అక్కడ లభించిన ఆదరణ, రాజ్యపాలన, కళాపోషణను అద్భుతంగా చిత్రీకరించిన ‘తంజావూరు విజ యం’ విశేషమైన పాఠకాదరణ పొందిన రచనగాచెప్పవచ్చు. చారిత్రక నవలలేగాక పట్టాలి. రెసిడెన్సీ, మహాసర్గ, సమ్రాట్ పుష్యమిత్ర, నగం విరిగిన చంద్రుడు వంటి అనేకానేక సాహితీ రచనలు కూడా ఆయన చేశారు. కళనే జీవితంగా స్వీకరించిన ఓ కళాకారిణి మనో ప్రపంచాన్ని ‘ప్రతిభ’ నవ లలో ఆయన ఆవిష్కరించిన తీరు అనుపమానం. వంశధార నవలలో చలనచిత్ర రంగంలోని రచయిత జీవితం, మానవ సంబంధాలను కథావస్తువుగా తీసుకొన్నారు. నన్నయభట్టు మళ్లీ పుట్టాడు వంటి వ్యంగ్యరచనలు సమకాలీన భాషా సాహిత్య పరిస్థితులను అద్దంపడతాయి. జాతీయ వాదం, హిందూధర్మ పరిరక్షణ, సాంస్క తిక చైతన్యం ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పాల్కురికి సోమనాధు నిపై ఆయన రచించిన ఆంగ్ల పరిశోధనాత్మక పరిచయ గ్రంథం ఎన్నో ప్రశంసలనందుకొంది. సమకాలీన సామాజిక పరిస్థితులపై వివిధపత్రికల్లో వందలాది వ్యాసాలను కూడా ఆయన రచించారు. నికషోపలం, శిప్రవాక్యం, వ్యాసదర్శ నం వంటి 25 సంపూటలలో ఆ వ్యాసాలను గ్రంథస్థం చేశారు. కుర్తాళం పీఠాధిపతి చేతుల మీదుగా కనకాభిషేకం చేయించుకొన్న ఘనత కూడా ఆయనదే. స్వర్ణగండపెండే రం, స్వర్ణ కంకణ సత్కారాలు అనేకానేకం. ఆయన స్వీయ చరిత్ర చదివితే ఇటువంటి ఇంకా అనేక అద్భుతమైన విష యాలు తెలుస్తాయి. ఆచార్య ముదిగొండ రచనావైదుష్యాన్ని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించడం తెలుగువారి బాధ్యతగా భావించాలి. ఇటీవలే, స్వర్గస్థులైన ఆయన రచ నలన్నీ ‘ముదిగొండ రచనా సర్వస్వం’గా ముద్రించి అందిస్తే మన చరిత్ర, సంస్కృతిని పరిరక్షించుకొన్నట్లవుతుంది.
-ఎ.వి.వి ప్రసాద్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
బంగ్లాదేశ్ తరహాలో భారత్లో పాలన మార్పునకు కాంగ్రెస్ ప్రయత్నం

