Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మటన్ కత్తితో ప్రియుడిని కొట్టి చంపిన వివాహిత! మూటగట్టి ఏం చేసింది?

మటన్ కత్తితో ప్రియుడిని కొట్టి చంపిన వివాహిత! మూటగట్టి ఏం చేసింది?

వార్త 2 months ago

Jeedimetla crime:హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఉన్న చింతల్ అంబేడ్కర్ నగర్‌లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శివారెడ్డి అనే వ్యక్తి ఒక మహిళతో గత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.

అయితే కొంతకాలంగా అతను ఆమెను, ఆమె కొడుకును తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు రోజురోజుకూ పెరిగిపోవడంతో వారు తట్టుకోలేకపోయారు. చివరకు అతడిని అంతం చేయాలని ఆ తల్లి, కొడుకు నిర్ణయించుకున్నారు.

Read also: Amrabad road accident: అమ్రాబాద్ సమీపంలో బస్సు-కారు ఢీ!

 Police inspecting crime scene in Hyderabad

Jeedimetla crime: మటన్ కత్తితో దాడి.. మూటగట్టి తరలింపు

ఆదివారం అర్ధరాత్రి సమయంలో శివారెడ్డి గొడవకు దిగడంతో మహిళ తన కుమారుడితో కలిసి అతడిపై దాడి చేసింది. ఇంట్లో ఉన్న మటన్ కొట్టే కత్తితో శివారెడ్డిని విచక్షణారహితంగా నరికి చంపారు. రక్తం మడుగులో పడి అతను మరణించిన తర్వాత, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఒక మూటలో కట్టారు. ఆ మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసేందుకు ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారు.

పోలీసుల తనిఖీలో బయటపడ్డ అసలు నిజం

అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఆ మహిళ, ఆమె కొడుకు ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. వారు తీసుకెళ్తున్న పెద్ద మూటను చూసి ఆపి తనిఖీ చేయగా, లోపల శివారెడ్డి శవం బయటపడింది. దీంతో పోలీసులు షాక్‌కు గురై వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పుణెలో చిన్నారి హత్య ఘటనలో వృద్ధుడి అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha