Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మత్స్యకారులకు రూ.5 లక్షల ప్రమాద బీమా..!

మత్స్యకారులకు రూ.5 లక్షల ప్రమాద బీమా..!

వార్త 2 weeks ago

Fishermen Insurance : తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది.

ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి శ్రీహరి వెల్లడించారు. ప్రమాదాల సమయంలో మత్స్యకారుల (Fishermen Insurance) కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన

.Read Also : వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

కుటుంబాలకు ప్రమాద బీమా రక్షణ :

ఈ బీమా పథకం 18 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగిన మత్స్యకారులకు వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,21,767 మంది మత్స్యకారులు ఈ పథకంలో రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు, వారి కుటుంబాలకు ప్రమాద బీమా రక్షణ లభించనుంది. ఈ పథకానికి సంబంధించిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో చెల్లించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మొత్తం రూ.21,34,73,673 చెల్లించనుంది. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

పథకం నిబంధనల ప్రకారం ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణించినా లేదా పూర్తిస్థాయి వైకల్యానికి గురైనా రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది. పాక్షిక వైకల్యానికి గురైన వారికి రూ.2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ప్రమాదం కారణంగా చికిత్స అవసరమైన సందర్భాల్లో వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల వరకు బీమా ప్రయోజనం అందించనున్నారు.

చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు తరచూ ప్రమాదాలను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా సముద్రం, నదులు, చెరువుల్లో చేపల వేట సమయంలో అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఈ బీమా పథకం రక్షణ కల్పించనుంది. మత్స్యకారుల జీవన భద్రత, కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే దిశగా ఈ ప్రమాద బీమా పథకం కీలక అడుగుగా భావిస్తున్నారు.

గోవింద నామాలను పేరడీ చేయడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha