Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 1న పామర్రుకు సీఎం చంద్రబాబు.. పకడ్బందీగా ఏర్పాట్లు

మే 1న పామర్రుకు సీఎం చంద్రబాబు.. పకడ్బందీగా ఏర్పాట్లు

వార్త 1 month ago

CM Chandrababu Pamarru Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మే 1వతేదీ కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబందించిన ఏర్పాట్లను కృష్ణాజిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ బుధవారం ఉదయం పరిశీలించారు. పమిడిముక్కల మండలంలో కపిలేశ్వరపురం గ్రామంలో హెలిప్యాడ్, బారికేడ్లను పరిశీలించారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులకు వేచి ఉండేందుకు హెలిప్యాడ్ సమీపంలో షామియానా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పమిడిముక్కల గ్రామంలో ప్రజావేదిక నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ పనుల్లో వేగం పెరగాలని అప్రోచ్ రహదారిని నిర్మించాలని ఆదేశించారు.

Read also: TRS Party: టీఆర్ఎస్ పేరు నాదే.. ఈసీకి తుపాకుల బాలరంగం లేఖ

 Officials inspecting helipad at Pamarru

CM Chandrababu Pamarru Tour: ప్రజావేదిక వద్ద పనుల వేగం పెంచాలి

భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖీ కార్యక్రమం ఉన్నందున ఇందులో పాల్గొనే కార్మికుల జాబితా సిద్ధం చేయాలన్నారు. ప్రజావేదికపై సియంతోపాటు కూర్చునే లబ్దిదారుల పేర్లు ఖరారు చేయాలని, వీరంకిలాకులోని ఎన్టీఆర్ కాలనీలో పించన్ పంపిణీ చేసే లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, ప్రజావేదిక వద్ద ప్రజలకు తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మికశాఖ వైద్యభీమా కమీషనర్ ఆంజనేయులు, ఉయ్యూరు ఇన్చార్జ్ ఆర్టీఓ బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు..

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మాజీ మంత్రి అప్పలనరసింహరాజు మృతిపై లోకేశ్ నివాళి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha