Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 25 నుండి తెలంగాణలో మహిళా వారోత్సవాలు..

మే 25 నుండి తెలంగాణలో మహిళా వారోత్సవాలు..

వార్త 3 days ago

TG Mahila Warotsavalu: తెలంగాణ ప్రభుత్వం మే 25 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మహిళా వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.

ఆడబిడ్డల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలే లక్ష్యంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలను, వివిధ రంగాల ప్రతిభావంతులను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు.

Read also: Kukatpally electric car accident: కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం.. టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన వైనం!

 Telangana mahila warotsavalu event

హైదరాబాద్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 29న హైదరాబాద్ నగరంలో నిర్వహించే ప్రత్యేక వేడుకల్లో పాల్గొంటారు. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు సరికొత్త ఇంక్యుబేటర్ కేంద్రాన్ని సీఎం ప్రారంభిస్తారు. దీనితో పాటు మహిళల ఉపాధి అవకాశాలను పెంచే జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను కూడా అదే రోజు అధికారికంగా మొదలుపెడతారు.

TG Mahila Warotsavalu: గ్రామీణ మహిళల ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు

ఈ వారోత్సవాలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు సరికొత్త ఉత్సాహాన్ని అందించనున్నాయి. మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి, ఆర్థికంగా స్థిరపడటానికి ప్రభుత్వం ఈ వేదిక ద్వారా పూర్తి మద్దతు ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా శక్తినంతటినీ ఒకేతాటిపైకి తెచ్చి వారి విజయాలను వేడుకగా జరపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha