Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 9న పశ్చిమ బెంగాల్లో BJP ప్రభుత్వం ప్రమాణస్వీకారం?

మే 9న పశ్చిమ బెంగాల్లో BJP ప్రభుత్వం ప్రమాణస్వీకారం?

వార్త 1 month ago

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మే 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Read Also: Tamilnadu : సెన్సేషనల్ రికార్డును సొంతం చేసుకున్న TVK పార్టీ

West Bengal: మే 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం?

పశ్చిమ బెంగాల్‌లో మే 9వ తేదీన బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. అగ్రకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నిర్వహించే 'పొచిశే బోయ్ షోక్' వేడుకల రోజే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. బెంగాలీ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రోజునే కొత్త పాలనను ప్రారంభించడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

ముఖ్యమంత్రి పీఠంపై సువేందు అధికారి?

ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్, భవానీపూర్ రెండింటిలోనూ ఘనవిజయం సాధించిన సువేందు అధికారి పేరు ముఖ్యమంత్రి పదవికి బలంగా వినిపిస్తోంది. బెంగాల్‌లో టీఎంసీ కోటను బద్ధలు కొట్టడంలో కీలక పాత్ర పోషించిన ఆయనకే పట్టాభిషేకం జరుగుతుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

వికసిస్తున్న కమలాలు.. బెంగాల్‌లో చారిత్రాత్మక విజయంపై ప్రధాని మోదీ ప్రశంస

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha