UPI Payments : దేశంలో నగదు రహిత లావాదేవీల (Cashless Transactions) వినియోగం నానాటికీ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. గత మే నెలలో భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు ఆల్ టైమ్ హై రికార్డును తాకాయి.
ఈ ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా Rs.29.90 లక్షల కోట్ల విలువైన డిజిటల్ చెల్లింపులు జరిగాయి. గత ఏడాది (2025) మే నెలలో నమోదైన ₹25.14 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది ఏకంగా 19 శాతం భారీ వృద్ధిని నమోదు చేయడం విశేషం. గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు ప్రతి ఒక్కరూ రూపాయి కాయిన్ దగ్గర నుంచి లక్షల రూపాయల వ్యాపారాల వరకు యూపీఐ పేమెంట్లపైనే ఆధారపడుతున్నారనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం.

పెరిగిన ఖర్చులు – ఎగబాకిన ట్రాన్సాక్షన్ల సంఖ్య
లావాదేవీల విలువలోనే కాకుండా, జరిగిన ట్రాన్సాక్షన్ల సంఖ్యలో కూడా గత మే నెల సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఏడాది మే నెలలో 18.67 బిలియన్ల (1,867 కోట్లు) లావాదేవీలు జరగ్గా, ఈసారి 24 శాతం అద్భుతమైన వృద్ధితో ఏకంగా 23.20 బిలియన్ల (2,320 కోట్లు) ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ముఖ్యంగా మే నెలలో వేసవి సెలవుల కారణంగా దేశీయ, అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్స్ పెరగడం, వినోద రంగ ఖర్చులు, షాపింగ్స్ మరియు చిన్న, పెద్ద వ్యాపార లావాదేవీల్లో డిజిటల్ పేమెంట్లను విరివిగా ఉపయోగించడమే ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ జోరు చూస్తుంటే భవిష్యత్తులో భారతీయ రిటైల్ మార్కెట్ పూర్తిగా డిజిటల్ మయంగా మారే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని స్పష్టమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్

