Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెదక్ జిల్లా రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు.. రూ.7 కోట్ల ధాన్యం మాయం!

మెదక్ జిల్లా రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు.. రూ.7 కోట్ల ధాన్యం మాయం!

వార్త 2 weeks ago

Medak Rice Mill: మెదక్ జిల్లా కుల్చారం మండలంలోని ఎం/ఎస్ శ్రీ సత్యసాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై సోమవారం రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ప్రభుత్వానికి చెందిన ధాన్యం నిల్వలను పరిశీలించిన అధికారులు సుమారు 3,029.96 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించారు.

ఈ కొరత విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. అనంతరం మిల్ యాజమాన్యం పై కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నిత్యానంద్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలో లోని ఓ రైస్ మిల్లు పై రాష్ట విజిలెన్స్ అధికారులు జిల్లా జిల్లా సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు.

Read Also:Medak POCSO Case: మెదక్ జిల్లాలో పోక్సో కేసు.. కోర్టు కఠిన తీర్పు

Medak Rice Mill: ఈ సందర్భంగా ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ (CMR) కోసం రైస్ మిల్లుకు అప్పగించిన ధాన్యానికి సంబంధించి అధికారులు రికార్డులు, గోదాముల్లోని నిల్వలు, సివిల్ సప్లైస్ వివరాలను పరిశీలించడం జరిగిందన్నారు. అందులో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించిన ధాన్యం లెక్కల్లో భారీ వ్యత్యాసం బయటపడినట్లు గుర్తించినట్లు తెలిపారు. అధికారుల లెక్కల ప్రకారం మిల్లులో 4,426.49 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండాల్సి ఉండగా, తనిఖీ సమయంలో కేవలం 1,396.53 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో 3,029.96 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉందని ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన విజిలెన్స్ అధికారులు సంబంధిత రైస్ మిల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ధాన్యం కొరతకు గల కారణాలు, ప్రభుత్వ ధాన్యాన్ని ఇతరత్రా తరలించారా లేదా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అధికారుల పూర్తి నివేదిక అనంతరం జిల్లా కలెక్టర్ సూచనల బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని డీఎస్ఓ తెలిపారు.

Epaper: epaper.vaartha.com

వరి వద్దు.. ఆయిల్ పామ్ ముద్దు:కలెక్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha