Medak Census 2026: మెదక్ జిల్లాలో 21 మండలాలు నాలుగు మున్సిపాలిటీలలో నేటి నుంచి జన గణన ప్రారంభమైందని ఇంటికి వచ్చే ఎన్యూమా రేటర్లు,సూపర్వైజర్లకు ప్రజలు నిబద్ధతతో నిజాయితీగా పూర్తి సమాచారం అందించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమసింగ్ తెలిపారు..
ఈ సందర్భంగా మెదక్ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జనగణనకు సంబంధించి అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం జన గణనకు సంబంధించిన ప్రత్యేక ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ జండా ఊపి ప్రారంభించారు… జనగణలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పాల్గొని వివరాలను నమోదు చేయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు..ప్రజలు ఇచ్చే డేటా బయటకు వస్తుందనేటువంటి విషయంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. మీరిచ్చే డేటా భద్రతగా ఉంటుందన్నారు…
Medak Census 2026
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

