Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెదక్ పెద్ద శంకరంపేటలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

మెదక్ పెద్ద శంకరంపేటలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

వార్త 2 months ago

Civil Supply DM Jagadish : రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సివిల్ సప్లై డిఎం జగదీష్ పెద్ద శంకరంపేట (మెదక్) రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ జగదీష్, అల్లాదుర్గం సీఐ రేణుకా రెడ్డిలు సూచించారు.

సోమవారం నాడు స్థానిక రైతు వేదికలో రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, వేగం నియంత్రణలో ఉంచాలని వారు సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.

 Civil Supply DM Jagadish Road safety awareness program in Medak Pedda Shankarampet

అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. ఇటువంటి నిర్లక్ష్య చర్యలు ప్రాణ నష్టాలకుదారితీస్తాయని హెచ్చరించారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేస్తూ జాగ్రత్తలు పాటించాలని, గ్రామీణ రహదారులపై మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం పట్టణంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలను అధికారులు పూడ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ జంగం రేణుక, ఎస్సై ప్రవీణ్ రెడ్డి, ఎంఈఓ శేఖర్ ,రిటైర్డ్ ఎంఈఓ వెంకటేశం, ఈవో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha