Gold robbery : మెదక్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు.
తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు విరుచుకుపడటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది.
పెళ్లికి వెళ్లిన ఇల్లే లక్ష్యం.. 120 తులాల బంగారం మాయం
చీలపల్లి గ్రామానికి చెందిన రాయిని రాములు కుటుంబం ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఊరెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు 120 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండిని అపహరించారు. ఉదయం పనిమనిషి వచ్చి చూసేసరికి తాళాలు విరిగి ఉండటంతో యజమానులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Medical shops strike: మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్!
Gold robberyవరుస చోరీలతో వణికిపోతున్న గ్రామం
దొంగలు కేవలం రాములు ఇంటితోనే ఆగకుండా, అదే గ్రామంలోని మరో మూడు ఇళ్లలో కూడా దొంగతనాలకు పాల్పడ్డారు. మాణిక్యరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రెండు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి క్లూస్ టీమ్‌తో రంగంలోకి దిగారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామంలో వరుస చోరీలు జరగడంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

