Ram Charan: ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) సందర్భంగా మెగా అభిమానులకు ఒక బ్యూటిఫుల్ సర్‌ప్రైజ్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'మెగా 158' (Mega 158) షూటింగ్ లొకేషన్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అకస్మాత్తుగా విచ్చేశారు.
ఫాదర్స్ డే రోజున చరణ్ ఇలా సడెన్‌గా సెట్స్‌కు వచ్చి తన తండ్రి చిరంజీవిని కలవడంతో చిత్ర యూనిట్ అంతా సర్ప్రైజ్ అయ్యారు. కొద్దిసేపు తండ్రీకొడుకులు ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.

Read also: Sandhya Theater Stampede Case : నేడు నాంపల్లి కోర్టుకు 'పుష్ప రాజ్ '
డైరెక్టర్ బాబీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
హిట్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి తన 158వ ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న వేళ రామ్ చరణ్ సెట్స్‌కు వచ్చిన విశేషాలను దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "మెగా 158 సెట్స్‌లో ఒక అద్భుతమైన ఫాదర్స్ డే మూమెంట్‌ను కళ్లారా చూశాను. చరణ్ బాబు సెట్స్‌కు వచ్చి తన తండ్రితో క్వాలిటీ టైమ్ గడిపారు. ఎంత ఎదిగినా, ఎంత పెద్ద స్టార్స్ అయినా కుటుంబంపై చూపించే ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే" అంటూ రాసుకొచ్చారు.
Ram Charan: చిరు లుక్‌పై సస్పెన్స్!
అయితే, ఈ పోస్టులో డైరెక్టర్ బాబీ కేవలం రామ్ చరణ్‌తో తాను దిగిన ఫొటోలను మాత్రమే షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి ఫొటో ఎక్కడ? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ సినిమాలో చిరు ఒక సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నారని, ఆ లుక్ ఇప్పుడే బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే చిత్రబృందం మెగాస్టార్ ఫొటోను గోప్యంగా ఉంచిందని ఫిలింనగర్ టాక్.
వాల్తేరు వీరయ్య కాంబో రిపీట్
గతంలో చిరంజీవి, బాబీ కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద రికార్డుల రికార్డులు సృష్టించింది. మళ్లీ అదే కాంబినేషన్‌లో వస్తున్న 'మెగా 158' కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూపిస్తానని బాబీ హింట్ ఇస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

