Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా ఛాన్స్ మిస్ చేసుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ

మెగా ఛాన్స్ మిస్ చేసుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ

వార్త 1 week ago

Preethi Mukundan : 'కన్నప్ప', 'బ్లాస్ట్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను చేజార్చుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రాకా’లో నటించే గోల్డెన్ ఛాన్స్‌ను ఆమె మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ప్రీతీ ముకుందన్‌ను సంప్రదించినట్లు దర్శకుడు అట్లీ స్వయంగా ఒక తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, అప్పటికే ఆమె ఒప్పుకున్న ఇతర సినిమాల బిజీ షెడ్యూల్స్ మరియు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఈ మెగా ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో ప్రీతీ నటించి ఉంటే ఆమె కెరీర్‌కు ఇది పెద్ద ప్లస్ అయ్యేదంటూ టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ప్రీతీ ప్లేస్‌లోకి ఫెమినా జార్జ్.. రంగంలోకి నలుగురు భామలు!

ప్రీతీ ముకుందన్ డేట్స్ కుదరకపోవడంతో, ఆ పాత్ర కోసం మలయాళ నటి ఫెమినా జార్జ్‌ను అట్లీ ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే, ‘రాకా’ సినిమాలో హీరోయిన్ల లైన్అప్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్ సరసన మెయిన్ లీడ్ హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోంది. అంతేకాదు, ఈ చిత్ర కథాంశం ప్రకారం మొత్తం నలుగురు హీరోయిన్లకు స్కోప్ ఉంటుందని, వారంతా కథను మలుపు తిప్పే పాత్రల్లో కనిపిస్తారని ఇండస్ట్రీ సమాచారం. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్, దానికి తోడు ఇంతమంది స్టార్ కాస్టింగ్ తోడుకావడంతో ‘రాకా’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెన్సార్ రిపోర్ట్‌పై సోషల్ మీడియాలో ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన 'జన నాయగన్' టీమ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha