PM Modi Gifts Melody: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యంత ఆదరణ పొందిన 'మెలోని' (#Melodi - మోదీ, మెలోని కాంబినేషన్) క్రేజ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌ను కూడా షేక్ చేసింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఒక ప్యాకెట్ 'మెలోడీ' (Melody) చాక్లెట్లను కానుకగా ఇవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క వైరల్ మూమెంట్‌తో మెలోడీ చాక్లెట్లను తయారు చేసే మాతృసంస్థ ‘పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్’ (Parle Industries Ltd) షేర్లు స్టాక్ మార్కెట్‌లో ఒకేసారి భారీగా లాభపడి 'అప్పర్ సర్క్యూట్' (Upper Circuit)ను తాకాయి.
'మెలోడీ ఇట్నీ చాక్లెటీ క్యూ హై?'.. నెట్టింట మీమ్స్ వర్షం!
గత కొంతకాలంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య ఉన్న మైత్రిని నెటిజన్లు 'మెలోని' (Melodi) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే పేరుతో ఉన్న చాక్లెట్ ప్యాకెట్‌ను పీఎం మోదీ స్వయంగా ఇటలీ ప్రధానికి గిఫ్ట్‌గా ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “మెలోడీ ఇట్నీ చాక్లెటీ క్యూ హై?” (Melody ఇంత చాక్లెటీగా ఎందుకు ఉంటుంది?) అనే పాత యాడ్‌ను గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ వరదలా పారుతున్నాయి. ఈ క్రేజ్ కాస్తా నేరుగా బిజినెస్ మార్కెట్‌పై ప్రభావం చూపించడం విశేషం.
Melody Chocolate Stock Price
PM Modi Gifts Melody: బ్రాండ్ వాల్యూను మార్చేసిన సింగిల్ గిఫ్ట్
ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ గిఫ్ట్ కారణంగా ఒక కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకడం చూస్తుంటే ‘బ్రాండ్ మెలోని’ పవర్ ఏంటో అర్థమవుతోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ మైత్రి కాస్తా బిజినెస్ ప్రమోషన్‌గా మారి పార్లే ఇండస్ట్రీస్‌కు కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ అటు పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు ఇటు బిజినెస్ వరల్డ్‌లోనూ విపరీతంగా వైరల్ అవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com

