Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెరుగైన నిద్ర కావాలంటే రోజు బాదం తినాలసిందే !!

మెరుగైన నిద్ర కావాలంటే రోజు బాదం తినాలసిందే !!

వార్త 3 weeks ago

Almonds : క్రమబద్ధమైన నిద్రా లేమితో బాధపడుతున్న భారతీయ పెద్దలకు రోజువారీ ఆహారంలో బాదం పప్పులను చేర్చడం ద్వారా సుఖనిద్ర సాధ్యమవుతుందని తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది.

‘ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా’ నిధులతో 21 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల 175 మంది భారతీయ పెద్దలపై 20 వారాల పాటు నిర్వహించిన రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్‌లో ఈ విషయాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా తీసుకునే చివ్డా, ఖాక్రా మరియు క్రాకర్స్ వంటి ప్రాసెస్డ్ స్నాక్స్‌కు బదులుగా రోజుకు 60 గ్రాముల (సుమారు 50) బాదం పప్పులను అందించగా, వారిలో నిద్ర నాణ్యత పెరగడంతో పాటు పడకపైకి వెళ్లిన తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకున్నట్లు స్వీయ నివేదికల ద్వారా స్పష్టమైంది. అంతేకాకుండా, పడకపై గడిపిన సమయంలో ఎక్కువ సేపు గాఢ నిద్రలో ఉండటం (స్లీప్ ఎఫిషియెన్సీ) మరియు రాత్రి వేళ మధ్యలో మెలకువ వచ్చే వ్యవధి తగ్గడం వంటి సానుకూల మార్పులను పరిశోధకులు గుర్తించారు.

బాదంలోని పోషకాలు – నాడీ వ్యవస్థపై వాటి ప్రభావం

బాదం పప్పుల్లో నిద్రను ప్రేరేపించే మెగ్నీషియం, ట్రిప్టోఫాన్, మెలటోనిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే ఈ మార్పులకు ప్రధాన కారణమని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో సెరోటోనిన్ మరియు నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తికి ట్రిప్టోఫాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి తోడు బాదంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు కండరాల సడలింపునకు, నాడీ వ్యవస్థ నియంత్రణకు తోడ్పడతాయి. అయితే యంత్రాల (పాలిసోమ్నోగ్రఫీ – PSG) ఆధారంగా కొలిచే శారీరక నిద్రా ప్రమాణాలపై వీటి ప్రభావాన్ని మరింత స్పష్టంగా అంచనా వేసేందుకు తదుపరి పరిశోధనలు అవసరమని పేర్కొన్నప్పటికీ, సహజ సిద్ధమైన ప్లాంట్-బేస్డ్ పోషకాహారంగా బాదం నిద్ర సమస్యలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణురాలు షీలా కృష్ణస్వామి అభిప్రాయపడ్డారు.

చిన్న వయసులోనే పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha