Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెరుగుపడుతున్న PHCల పనితీరు.. ఆరు నెలల్లో భారీ మార్పు!

మెరుగుపడుతున్న PHCల పనితీరు.. ఆరు నెలల్లో భారీ మార్పు!

వార్త 5 days ago

మంత్రి సత్యకుమార్ కు నివేదించిన డిహెచ్ పద్మావతి

AP PHC performance: గత మార్చి నెలలో 1,144కు 312 పిహెచ్సి ఆసు పత్రులు ఎ శ్రేణిలో వచ్చాయి. గతేడాది అక్టోబరు నెలలో 107 పిహెచ్సిలు మాత్రమే ఎ శ్రేణిలో ఉన్నాయి.

కేవలం ఆరు నెలల్లో మూడు రెట్లు ఎక్కువగా పిహెచ్సిలు, ఎ శ్రేణికి చేరుకోవడం గమనార్హం. ఇదే కాల వ్యవధిలో బి శ్రేణి ఆసు పత్రులు 354 నుంచి 455 కు చేరుకున్నాయి. ໖. ໕, ఇ గ్రేడుల ఆసుపత్రులు తగ్గుతూ వచ్చాయి. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్షర్మేషన్ సిస్టమ్లో నమోదుచేసే వివరాల ప్రకారం పిహెచ్సిల పనితీరును శ్రేణుల వారీగా గుర్తించి, సదరు నివేదికను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్డ్ డాక్టర్ పద్మావతి రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు అందజేశారు.

Read Also : Toll Plaza New Rules: ఓవర్ లోడ్ వాహనాలకు భారీ టోల్ ఫీజు

 PHCs’ performance is improving.. Huge change in six months!

AP PHC performance: పనితీరు మదింపు, మార్కుల విధానం

గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు నెలల వారీగా 1144 పిహెచ్సిల పనితీరు మదింపు వివరాలను డిహెచ్ తన నివేదికలో పొందుపరి చారు. బి గ్రేడ్ కేంద్రాలు తన నివేదికలో పొందుపరిచారు. బి గ్రేడ్ కేంద్రాలు కిందటేడాది అక్టోబరులో 354 ఉండగా మార్చి నాటికి 455 చేరుకున్నాయి. సీ గ్రేడులో 298 డి గ్రేడులో 72, ఇగ్రేడులో 7చొప్పున ఆసుపత్రులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1144 పిహెచ్సిలు ఉన్నాయి. ఓపికి 1, ఐపీ-1 ల్యాప్టాస్టు-1, ప్రసవాలు-1 ఇతర ఒకటి చొప్పున కలిపి ఐదు మార్కులు ఇస్తు న్నారు. పిహెచ్సిల ద్వారా రోగులకు అందచేసే సేవల వివరాల హెచ్ఎంఐఎస్ ఎప్పటికప్పుడు నమోదవుతున్నాయి. నెలకు 1500 ఓపి, 100 ఐపీ ల్యాబ్ టెస్టులు,-3000, పది చొప్పున జరగాలి. ఇంకొన్ని ఫలితాలను శాస్త్రీయ కోణంలో విశ్లేషించి పనితీరు ప్రతిపాదికన పిహెచ్సిలకు వైద్య ఆరోగ్య శాఖ శ్రేణులు ఇస్తోంది.

ఉన్నతాధికారుల సమీక్షలు – మెరుగైన ఫలితాలు

సమీక్షా సమావేశాల్లో తక్కువ పనితీరు కనబరిచే ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశాల ద్వారా ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. వీటికి అనుగుణంగా జిల్లాలకు వెళ్లే ఆదేశానుసారం అక్కడి అదికారులు పిహెచ్సిల వైద్యులతో సమీక్షలు జరుపుతూ వైద్య సేవలు మెరుగపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల పిహెచ్సిల పనితీరు క్రమంగా మెరుగుపడుతోంది. దీనివల్ల సి, డి, ఇ గ్రేడ్లలో ఉన్న పిహెచ్సిలు తగ్గుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో కురబలకోట, పిహెచ్సి అక్టోబరు నుంచి మార్చి వరకు ప్రతినెలా ఎ శ్రేణిలో వచ్చింది. ఈస్టుగోదావరి జిల్లాలో బ్రహ్మణగూడెం, చాగల్లు, నల్లజర్ల పిహెచ్సిలు వరుసగా ఆరుసార్లు ప్రథమ శ్రేణిలో వచ్చాయి. కాకినాడ జిలాలో తేటగుంట పిహెచ్సి ఆరుసార్లు ఇలా ప్రతి జిల్లాలో కొన్ని పిహెచ్సిలుఐదు నుంచి మూడుసార్లు చొప్పున ఎ శ్రేణిలో వచ్చాయి.

జిల్లాల వారీగా పిహెచ్సిల గ్రేడింగ్ వివరాలు

ఈ ఏడాది మార్చి నెల శ్రేణుల పరిశీలిస్తే వెస్టు గోదావరిలో 34కు, 33, కృష్ణా జిల్లాలో 49కు 42, వైఎస్సార్ కడప-57 కు 42, విజయనగరం జిల్లాలో 48కు 32 పిహెచ్సిలు ప్రథమ శ్రేణిలో వచ్చాయి. పోలవరం జిల్లాలో 28 పిహెచ్సిలకు 2, మార్కాపురం జిల్లాలో 38కు 1, శ్రీకాకుళం జిల్లాలో 66కు ఒకటి, నెల్లూరు జిల్లాలో 52కు ఒకటి, చిత్తూరు జిల్లాలో 42కు పిహెచ్సి ఈ గ్రేడులో ఉన్నాయి. గత మార్చి నెలకు సంబంధించి డి గ్రేడ్ పిహెచ్సిలు రాష్ట్రవ్యాప్తంగా 72 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 10 చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. అలాగే అల్లూరి సీతారామారాజు జిల్లాలో తొమ్మిది, పోలవరం జిల్లాలో 8, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో ఏడు చొప్పున, ఏలూరు జిల్లాలో ఆరు చొప్పున డి గ్రేడ్ ఆసుపత్రులు ఉన్నాయి. గత మార్చి నెలలో ఇ గ్రేడు ఆసుపత్రులు ఏడు ఉంటే రెండు పోలవరం జిల్లాలో ఉన్నాయి. నెల్లూరు చిత్తూరు, మార్కాపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క పిహెచ్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha