Vizianagaram Crime: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం పరిచయమైన ఓ యువతి తన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన పున్నాన శేఖర్ (10వ తరగతి వరకు చదివి ఫర్నీచర్ షాప్‌లో పనిచేస్తున్న యువకుడు) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also:Kukatpally oyo hotels raid: కూకట్‌పల్లిలో ఓయో హోటళ్ల గుట్టు రట్టు
Vizianagaram Crime: ఘటన వివరాలు & నేపథ్యం

గత జూన్ నెలలో తన సోదరి ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లిన శేఖర్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలు మార్చుకుని ప్రతిరోజూ మెసేజ్‌లు మాట్లాడుకునేవారు. ఇటీవల సదరు యువతి శేఖర్ పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ఆపేసింది. రెండు రోజులుగా ఎంత ప్రయత్నించినా స్పందన రాకపోవడంతో శేఖర్ తీవ్ర తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం ఎంతసేపటికీ ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తలుపులు బద్దలుగొట్టి చూడగా, శేఖర్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ: ఎంపీ అవినాశ్ రెడ్డి ఇళ్లలో సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం

