Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మిల్లర్ల అక్రమాలపై నంగునూర్ మార్కెట్ చైర్మన్ ఫైర్!

మిల్లర్ల అక్రమాలపై నంగునూర్ మార్కెట్ చైర్మన్ ఫైర్!

వార్త 8 hrs ago

Nangunoor Paddy Procurement: సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్ల తీరుపై నంగునూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అధిక తూకం లేదా తరుగు పేరిట అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం మండలంలోని కొండం రాజపల్లి, ఘనపూర్, తిమ్మాయిపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాలలో ధాన్యం నాణ్యతను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బస్తాకు 3 కిలోల తరుగు దోపిడీపై మండిపాటు

కొనుగోలు కేంద్రాల పరిశీలన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి మీడియాతో మాట్లాడారు. మండలంలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైస్ మిల్లర్లు తాలు, తేమ శాతం నెపంతో రైతులను తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా క్వింటాకు 3 కిలోల వరకు తరుగు పేరిట ధాన్యాన్ని అదనంగా ఇవ్వాలని రైతులను, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. బస్తాకు 3 కిలోల తరుగుకు ఒప్పుకుంటేనే మిల్లుల వద్ద లోడ్లను దిగుమతి చేసుకుంటామని, లేదంటే అన్ లోడ్ చేయమని బెదిరింపులకు దిగుతూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని, ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Grain Rice : ధాన్యం తడిసినా కొనాల్సిందే..అధికారులకు ఉత్తమ్ ఆదేశాలు

రైతుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు

ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లలో తాలు, మట్టి ఉందనే సాకుతో ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువ తరుగు తీయడం వల్ల రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందన్నారు. దీనికి తోడు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వెళ్లిన లోడ్లను అన్‌లోడ్ చేయడంలో మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. మరోపక్క ఏ క్షణంలోనైనా అకాల వర్షాలు రావచ్చనే భయాందోళనలో రైతులు ఉన్నారని, అన్నదాతల ఈ భయాన్ని పెట్టుబడిగా మార్చుకుని నిలువునా దోచుకోవాలనే దురాలోచనను మిల్లర్లు పక్కన పెట్టాలని సూచించారు.

Nangunoor Paddy Procurement: నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఖాయం

రైతులకు అండగా నిలవాల్సిన మిల్లర్లు గతంలో లాగా రకరకాల సాకులు చెప్తూ అడ్డగోలు కటింగులకు దిగితే చూస్తూ ఊరుకోబోమని దేవులపల్లి యాదగిరి స్పష్టం చేశారు. మిల్లర్లు రైతులకు, ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో తిమ్మాయిపల్లి సర్పంచ్, చేర్యాల రాజు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాగు శ్రీకాంత్ యాదవ్, పిల్లి నర్సింలు, లక్ష్మన్, రజినీకాంత్, తిరుపతి, సురేష్ తదితర స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

చిలపల్లి భారీచోరీ కేసును ఛేదించిన మెదక్ పోలీసులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha